భారత్‌లో అంతరించిపోతున్న అనేక పక్షి జాతులు.. ఉన్నది కేవలం కొద్ది మాత్రమే..! ఎందుకింత వైవిధ్యం

|

Aug 09, 2023 | 2:40 PM

భారతదేశంలో మాత్రమే కనిపించే 78 జాతుల పక్షులలో 25 అంతరించిపోయే దశలో ఉన్నాయని మజుందార్ చెప్పారు. 78 జాతుల పక్షులు మన దేశంలోని భౌగోళిక ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 75 ఎండిమిక్ బర్డ్స్ ఆఫ్ ఇండియా పుస్తకంలో ఇలాంటి 75 జాతులపై దృష్టి పెట్టామన్నారు.పశ్చిమ కనుమల్లో 28 జాతులు, అండమాన్ నికోబార్ దీవుల్లో 25 జాతులు, తూర్పు హిమాలయాల్లో నాలుగు జాతులు, దక్షిణ దక్కన్ పఠాన్, మధ్య భారత అడవుల్లో ఒక్కో జాతి పక్షులు ఉన్నాయని తెలిపారు.

భారత్‌లో అంతరించిపోతున్న అనేక పక్షి జాతులు.. ఉన్నది కేవలం కొద్ది మాత్రమే..! ఎందుకింత వైవిధ్యం
Bird Diversity
Follow us on

జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ZSI) ఇటీవలి ప్రచురించిన వివరణ మేరకు.. దేశంలో కనిపించే పక్షులలో 5% స్థానికంగా ఉన్నాయని, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో నివేదించబడలేదని పేర్కొంది. 75 ఎండిమిక్ బర్డ్స్ ఆఫ్ ఇండియా పేరుతో ఈ ప్రచురణ ఇటీవల ZSI 108వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా విడుదలైంది. ప్రపంచంలోని పక్షి జంతుజాలంలో 78 రకాల పక్షులు మాత్రమే భారతదేశంలోనే ఉన్నాయని ఓ నివేదిక పేర్కొంది. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం, ప్రపంచంలో మొత్తం 10,906 జాతుల పక్షులు నివసిస్తున్నాయి. వాటిలో మొత్తం 1,353 జాతుల పక్షులు భారతదేశంలో నివసిస్తున్నాయి. ప్రపంచంలోని పక్షులలో ఇది 12.4 శాతం. 78 రకాల పక్షులు భారతదేశంలో తప్ప మరెక్కడా లేవని పేర్కొంది. ఈ 78 రకాల పక్షులలో, 28 పశ్చిమ కనుమలలో, 25 అండమాన్, నికోబార్ దీవులలో, 4 తూర్పు హిమాలయాల్లో, దక్షిణ దక్కన్ పీఠభూమిలో ఒక్కొక్కటి మధ్య భారతదేశంలో ఉన్నాయి.

భారతదేశం 1,353 పక్షి జాతులకు నిలయంగా ఉంది. ఇది ప్రపంచ పక్షి వైవిధ్యంలో దాదాపు 12.40% ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ 1,353 పక్షి జాతులలో 78 (5%) దేశానికి చెందినవి. భారతదేశంలో 78 రకాల పక్షులు మాత్రమే ఉన్నాయని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనం పేర్కొంది. ఈ మేరకు ZSI శాస్త్రవేత్త అమితవ్ మజుందార్ మాట్లాడుతూ ప్రపంచంలో 10,906 పక్షి జాతులలో గొప్ప వైవిధ్యం ఉందని చెప్పారు. వీటిలో భారతదేశంలో 1,353 ఉన్నాయి.

ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వర్గీకరణ ప్రకారం.. భారతదేశంలో మాత్రమే కనిపించే 78 జాతుల పక్షులలో 25 అంతరించిపోయే దశలో ఉన్నాయని మజుందార్ చెప్పారు. 78 జాతుల పక్షులు మన దేశంలోని భౌగోళిక ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 75 ఎండిమిక్ బర్డ్స్ ఆఫ్ ఇండియా పుస్తకంలో ఇలాంటి 75 జాతులపై దృష్టి పెట్టామన్నారు.

ఇవి కూడా చదవండి

పశ్చిమ కనుమల్లో 28 జాతులు, అండమాన్ నికోబార్ దీవుల్లో 25 జాతులు, తూర్పు హిమాలయాల్లో నాలుగు జాతులు, దక్షిణ దక్కన్ పఠాన్, మధ్య భారత అడవుల్లో ఒక్కో జాతి పక్షులు ఉన్నాయని తెలిపారు. ఇందులో తీవ్రంగా ప్రమాదంలో ఉన్నవి ఐదు అంతరించిపోతున్నవిగా చెప్పారు. ఇంకా 17 రకాలైన పక్షలు హానికరమైనవిగా జాబితా తయారు చేశారు. ఇది కాకుండా ఇంకా 11 జాతులు ఉన్నాయి. వీటిని సకాలంలో రక్షించకపోతే అంతరించిపోతున్న జాబితాలోకి వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..