కర్నాటకలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలలో వెళ్తున్న ట్రక్కు ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన బెలగావిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు ప్రాణాలు కోల్పోగా, మరో 11 మందికి తీవ్ర గాయాలయినట్టుగా తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోకాక్ తాలూకలోని అక్కాతంగియార హలా గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికులు బెలగావికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
బెలగావిలోని కనబరగి గ్రామం వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం బళ్లారి నాలాలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సాయంతో వాహనంలో చిక్కుకుపోయిన వారిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బెలగావి పోలీస్ కమిషనర్ ఎంబీ బోర లింగయ్య ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు కర్నాటక పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, వారి ముగ్గురి పరిస్థితి విషమంగా అధికారులు పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి