Chhattisgarh: విహారయాత్రలో విషాదం నెలకొంది. జలపాతం అందాలను చూసి ఆనందించేందుకు వెళ్లిన పర్యాటకులు జలసమాధి అయ్యారు. వారాంతాన్ని ఎంజాయ్ చేసేందుకు విహార యాత్రకు వెళ్లిన ఆ కుటుంబంలో తీరని విషాదం మిగిలింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో చోటు చేసుకుంది. కొరియా జిల్లాలోని జలపాతంలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన మొత్తం ఆరుగురు మృత్యువాతపడ్డారు. మృతులను శ్వేతా సింగ్ (22), శ్రద్ధా సింగ్ (14), అభయ్ సింగ్ (22)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్‌కు చెందిన 15 మంది కుటుంబ సభ్యులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ్‌దహా జలపాతం వద్దకు ఆదివారం పిక్నిక్‌కు వెళ్లారు. జలపాతంలోని ప్లంజ్‌పూల్‌లో స్నానం చేస్తూ ఏడుగురు గల్లంతయ్యారు. స్థానికులు సమాచారం మేరకు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం రెండు మృతదేహాలను గుర్తించిన పోలీసులు..ఆస్పత్రికి తరలించారు. చీకటి కావడంతో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, పోలీసులు సెర్చ్ ఆపరేషన్‌ను ఆపేశారు. సోమవారం ఉదయం ఆపరేషన్ ప్రారంభించారు.
నీటిలో గల్లంతైన పర్యాటకుల మృతదేహాలను గుర్తించామని కొరియా కలెక్టర్ కుల్దీప్ శర్మ తెలిపారు. జలపాతంలో స్నానం చేయవద్దని ప్రజలను అభ్యర్థిస్తూ హెచ్చరిక బోర్డును ఉంచినప్పటికీ, పర్యాటకులు నీటిలోకి వెళ్లినట్లు పోలీసు అధికారి తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి