Medicine: షాకింగ్ న్యూస్.. డ్రగ్ క్వాలిటీ టెస్ట్‌లో 53 రకాల ట్యాబ్లెట్స్ ఫెయిల్..
వీటిలో పారాసిటమాల్ ట్యాబ్లెట్ కూడా ఉండడం ఆందోళన కలిగించే అంశం. జ్వరం వచ్చిన వెంటనే చాలా మంది వేసుకునే పారాసెట్‌మాల్ కూడా నాణ్యత పరీక్షలో ఫెయిల్ కావడం ఆందోళనకు కలిగిస్తోంది. కాల్షియం, విటమిన్, బీపీ, డయాబెటిస్ ట్యాబ్లెట్లు సహా మొత్తం 53 మాత్రలు ఈ క్వాలిటీ టెస్ట్‌లో అర్హత సాధించలేదని సీడీఎస్‌సీఓ స్పష్టం చేసింది...
పాల నుంచి నూనె వరకు అన్నిట్లో కల్తీ జరుగుతోంది. లాభాల కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు కేటుగాళ్లు. చివరికి ఆరోగ్యం బాగాలేకపోతే వేసుకునే మందులను సైతం కల్తీ చేస్తున్నారు. తాజాగా భారత ఔషధ నియంత్రణ సంస్థ. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిర్వహించిన డ్రగ్ క్వాలిటీ పరీక్షలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మనం ఉపయోగిస్తున్న దాదాపు 53 రకాల మాత్రలు ఈ క్వాలిటీ పరీక్షలో అర్హత సాధించకపోవడం గమనార్హం.
వీటిలో పారాసిటమాల్ ట్యాబ్లెట్ కూడా ఉండడం ఆందోళన కలిగించే అంశం. జ్వరం వచ్చిన వెంటనే చాలా మంది వేసుకునే పారాసెట్‌మాల్ కూడా నాణ్యత పరీక్షలో ఫెయిల్ కావడం ఆందోళనకు కలిగిస్తోంది. కాల్షియం, విటమిన్, బీపీ, డయాబెటిస్ ట్యాబ్లెట్లు సహా మొత్తం 53 మాత్రలు ఈ క్వాలిటీ టెస్ట్‌లో అర్హత సాధించలేదని సీడీఎస్‌సీఓ స్పష్టం చేసింది. ఈ జాబితాలో పారాసిటమాల్, కాల్షియం, విటమిన్ డీ3 సప్లిమెంట్ ట్యాబ్లెట్లు, యాంటీ డయాబెటిక్, హైబీపీ మాత్రలు కూడా ఉన్నాయని భారత ఔషధ నియంత్రణ సంస్థ వెల్లడించింది.
సీడీఎస్‌సీఓ నెలవారీగా ర్యాండమ్‌గా కొన్ని ట్యాబ్లెట్లను సేకరించి.. వాటి నమూనాల నుంచి ఈ క్వాలిటీ టెస్ట్‌లను చేస్తుంది. తాజాగా నిర్వహించిన ఈ పరీక్షల్లోనే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పరీక్షల్లో ఫెయిల్ అయిన ట్యాబ్లెట్స్‌లను హెటిరో డ్రగ్స్, ఆల్కెమ్ లేబొరేటరీస్, హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్, కర్ణాటక యాంటీ బయాటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, మెగ్ లైఫ్‌సైన్సెస్, ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్‌కేర్‌తో పాటు మరికొన్ని ప్రముఖ కంపెనీలు తయారు చేస్తున్నట్లు తేలింది.
ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ యాంటీ బయాటిక్ లిమిటెడ్ -హెచ్ఏఎల్ ఉత్పత్తి చేసే మెట్రోనిడాజోల్ ట్యాబ్లెట్ కూడా ఈ జాబితలో ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే.. గత నెలలో సీడీఎస్‌సీఓ భారతీయ మార్కెట్‌లో 156 రకాల ఫిక్స్‌డ్ డోస్ డ్రగ్ కాంబినేషన్‌లపై నిషేధం విధించింది. ఈ 156 రకాల డ్రగ్ కాంబినేషన్లను ఉపయోగించడం వల్ల మనుషులకు ప్రమాదం కలిగించే అవకాశం ఉందని పేర్కొంది.
ప్రజలు రోజు ఉపయోగించే కొన్ని మెడిసిన్స్ కూడా ఇందులో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా పాంటోసిడ్.. కడుపులో గ్యాస్, బర్నింగ్ సెన్సేషన్, ఎసిడిటీ వంటి సమస్యలున్న వారికి ఇది సూచిస్తంటారు. పాంటోసిడ్ పేరుతో మార్కెట్లో నకిలీ మందులు అమ్ముడవుతున్నట్లు వెల్లడైంది. అదే విధంగా అధికరక్తపోటుకు సంబంధించి ఉపయోగించే టెల్కా హెచ్ సైతం నకిలీవి మార్కెట్లో చలామణీ అవుతున్నట్లు తేలింది. లివర్ సమస్య ఉన్న వారు తీసుకునే ఉర్సోకోల్ 300, సన్ ఫార్మా తయారు చేసిన పుల్మో సిల్ కూడా నాణ్యత పరీక్షలో విఫలమయ్యాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..