AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PMLA: మనీ లాండరింగ్ కేసుల్లో ప్రజాప్రతినిధులు.. ఎంత మంది తాజా, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారో తెలుసా..

మనీ లాండ రింగ్, నగదు అక్రమ చెలామణి కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను త్వరితగతి విచారణకు సహకరించడానికి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది విజయ్ హన్స్ రాజ్ ను అమికస్ క్యూరీగా నియమించింది. విజయ్ హన్స్ రాజ్..

PMLA: మనీ లాండరింగ్ కేసుల్లో ప్రజాప్రతినిధులు.. ఎంత మంది తాజా, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారో తెలుసా..
Supreme Court
Amarnadh Daneti
|

Updated on: Nov 15, 2022 | 10:16 PM

Share

మనీ లాండ రింగ్, నగదు అక్రమ చెలామణి కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను త్వరితగతి విచారణకు సహకరించడానికి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది విజయ్ హన్స్ రాజ్ ను అమికస్ క్యూరీగా నియమించింది. విజయ్ హన్స్ రాజ్ మంగళవారం ఒక నివేదికను సుప్రీంకోర్టుకు అందించారు. అందులో ప్రజా ప్రతినిధులు ఎదుర్కొంటున్న పీఎంఎల్ఏ (మనీ లాండరింగ్) కేసుల వివరాలున్నాయి. ప్రస్తుత, మాజీ ఎంపీల్లో 51 మందిపై మనీ లాండరింగ్ కేసులున్నాయని, అలాగే, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో 71 మంది ఈ ఆరోపణలను ఎదుర్కొంటున్నారని ఆ నివేదికలో విజయ్ హన్స్ రాజ్ సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే, ఎంపీల్లో మాజీలు ఎంతమంది, సిట్టింగ్ లు ఎంత మంది అనే వివరాలను వెల్లడించలేదు.

మాజీ, ప్రస్తుత ఎంపీలు, అలాగే, మాజీ, ప్రస్తుత ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ కొనసాగుతోందని నివేదిక వెల్లడించింది. చాలా కేసుల విచారణ నిలిచిపోయిందని, కొన్ని కేసులు ఐదేళ్లకు పైగా కొనసాగుతున్నాయని తెలిపింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసులను త్వరిత గతిన విచారించేలా ఆదేశాలు జారీ చేయాలన్న సీనియర్ న్యాయవాది దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి సంబంధించి సుప్రీంకోర్టు ఈ విచారణ చేపట్టింది.

ప్రజా ప్రతినిధుల క్రిమినల్ కేసులను విచారిస్తున్న న్యాయమూర్తులను తమ అనుమతి లేకుండా బదిలీ చేయకూడదన్న తమ గత ఆదేశాలను సుప్రీంకోర్టు మంగళవారం ఉపసంహరించుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

Follow Us
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
పేదరికం నుండి ఎయిమ్స్ దాకా: డాక్టర్ రవితేజ స్ఫూర్తిదాయక ప్రయాణం
పేదరికం నుండి ఎయిమ్స్ దాకా: డాక్టర్ రవితేజ స్ఫూర్తిదాయక ప్రయాణం
ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి?
ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి?
ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..
నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..