Stray Dog Attack: ఐదేళ్ల చిన్నారిపై వీధి కుక్కల మూకుమ్మడి దాడి.. స్కూల్ నుంచి వస్తుండగా..
ఐదేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. ఎల్కేజీ చవువుతున్న చిన్నారి స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా మూడు వీధికుక్కలు దాడి చేశాయి. ఈ దారుణ ఘటన కేరళలో మంగళవారం (జూన్ 13) చోటుచేసుకుంది...

నీలంబుర్: ఐదేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. ఎల్కేజీ చవువుతున్న చిన్నారి స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా మూడు వీధికుక్కలు దాడి చేశాయి. ఈ దారుణ ఘటన కేరళలో మంగళవారం (జూన్ 13) చోటుచేసుకుంది.
కేరళ రాష్ట్రం నీలంబుర్‌కు చెందిన సయన్ మహ్మద్ (5) స్థానిక పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నాడు. మంగళవారం స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో మూడు వీధి కుక్కలు ఒక్కసారిగా దాడికి తెగబడ్డాయి. తన ఇంటికి కేవలం 50 మీటర్ల దూరంలోని ఈ ఘటన జరిగింది. సమీపంలో ఫుట్‌బాల్ ఆడుతున్న స్థానికులు గమనించి కుక్కలను తరిమికొట్టి బాలుడిని రక్షించారు. ఈ ఘటనలో బాలుడు ముఖం, శరీరంలోని ఇతర భాగాల్లో బలమైన గాయాలన్నాయి. సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. చిన్నారిని తొలుత నిలంబూర్ జిల్లా ఆస్పత్రికి తరలించగా.. అక్కడ సరైన మందులు అందుబాటులో లేకపోవడంతో మంజేరి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉంది.
కాగా జూన్ 11న కన్నూర్ సమీపంలోని ముజప్పిలంగాడ్ వద్ద 11 ఏళ్ల మూగ బాలుడు నిహాల్ వీధి కుక్కల దాడిలో మృతి చెందాడు. జూన్ 12న త్రిసూర్‌లో ఓ మహిళ, ఆమె కుమార్తెపై కూడా వీధి కుక్కలు దాడి చేశాయి. గత కొంతకాలంగా కేరళలో వరుసగా వీధికుక్కల దాడులు పెరిగిపోతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.