Chamayavilakku Festival: స్త్రీల వేషధారణలో పురుషుల పూజలు.. రథయాత్రలో ఐదేళ్ల చిన్నారి మృతి! ఏం జరిగిందంటే

|

Mar 26, 2024 | 10:31 AM

ఆ ఊరిలో పండగ వేళ ఘోర విషాదం చోటు చేసుకుంది. ఊరుఊరంతా కలిసి సంబరంగా జరుపుకుంటున్న రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. రథచక్రాల కింద పడి నగిలిపోయి ఐదేళ్ళ చిన్నారి మృతి చెందింది. ఈ విషాద ఘటన కేరళలోని కొల్లాంలోని కొట్టన్‌కులంగర ఆలయంలో ఆదివారం రాత్రి (మార్చి 24) చోటు చేసుకుంది..

Chamayavilakku Festival: స్త్రీల వేషధారణలో పురుషుల పూజలు.. రథయాత్రలో ఐదేళ్ల చిన్నారి మృతి! ఏం జరిగిందంటే
Chamayavilakku Festival
Follow us on

ఆ ఊరిలో పండగ వేళ ఘోర విషాదం చోటు చేసుకుంది. ఊరుఊరంతా కలిసి సంబరంగా జరుపుకుంటున్న రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. రథచక్రాల కింద పడి నగిలిపోయి ఐదేళ్ళ చిన్నారి మృతి చెందింది. ఈ విషాద ఘటన కేరళలోని కొల్లాంలోని కొట్టన్‌కులంగర ఆలయంలో ఆదివారం రాత్రి (మార్చి 24) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కేరళలోని కొల్లాంలోని కొట్టన్‌కులంగర ఆలయంలో ఊరి ప్రజలందరూ కలిసి ‘చమయవిళక్కు’ పండగ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భారీ రధంలో దేవుడిని ఐరేగిస్తున్నారు. ఈ గంథరగోళంలో తండ్రి చేతుల్లో నుంచి ఐదేళ్ల చిన్నారి క్షేత్ర జరిపడి ఉత్సవ రథం చక్రాల కింద నలిగి పోయింది. రథం చిన్నారి శరీరంపై నుంచి వెళ్లింది. దీంతో రథం చక్రాల కింద నలిగి తీవ్రగాయాలైన చిన్నారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన ఆదివారం (మార్చి 24) రాత్రి 11.30 నిమిషాలకు జరిగింది. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చవరా నివాసి దంపతుల కుమార్తె క్షేత్ర. తల్లిదండ్రులతో కలిసి ఆలయానికి వచ్చిన క్షేత్ర ప్రమాదవశాత్తు ఉత్సవ రథం చక్రాల కింద పడి మృతి చెందినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. రథాన్ని లాగుతున్న బహిరంగ మైదానంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కాగా కేరళ రాష్ట్రంలో హోళీ పండుగనే ‘చమయవిళక్కు’ పండుగగా జరుపుకుంటారు. ఈ పండగ రోజున పురుషులు స్త్రీల వేషధారణతో దేవాలయాల్లో ప్రార్థనలు చేస్తుంటారు. కేరళ రాష్ట్రంలో ‘చమయవిళక్కు’ పండుగ చాలా ముఖ్యమైనది. పండగ సందర్భంగా రథాన్ని లాగుతున్నారు. కొన్ని సార్లు పిల్లలు కూడా రథానికి కట్టిన తడును లాగుతుంటారు. ఈ క్రమంలో ప్రమాదాలు చోటుచేసుకుంటూ ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.