Chhattisgarh Road Accident: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన మంగళవారం రాత్రి గరియాబంద్‌కు సమీపంలో జరిగింది. గరియాబంద్ సమీపంలో జాతీయ రహదారిపై ట్రక్కు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ట్రక్కు వేగంగా ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మందికి తీవ్రగాయలయ్యాయని గరియాబంద్ ఎస్డీఎం విశ్వదీప్ యాదవ్ పేర్కొన్నారు. అదేవిధంగా ట్రాలీపై కూర్చున్న వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటేనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు గరియాబంద్ పోలీసులు తెలిపారు. మెయిన్‌పూర్ (Mainpur) వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
కాగా.. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చోప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ పేర్కొన్నారు.
Chhattisgarh | At least 5 dead, 17 injured in a collision between a truck and tractor at the national highway going towards Mainpur, a few km away from Gariyaband. People who were sitting on the trolley severely injured; police probe underway: Vishwadip Yadav, SDM, Gariyaband pic.twitter.com/zUAfAgMm2j
— ANI (@ANI) March 15, 2022
Also Read: