Covid-19 Third Wave: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వణుకుపుట్టిస్తోంది. గత కొన్ని రోజులుగా..కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. లక్షన్నరకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వరుసగా నాలుగో రోజు సోమవారం కూడా దేశంలో రోజువారీ కేసుల సంఖ్య లక్షకు పైగా నమోదయ్యాయి. దేశంలో 7 లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. కొన్ని వారాల్లో దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ సుల సంఖ్య దాదాపు 5 లక్షల వరకు పెరిగే అవకాశముందని కొందరు నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ మొదలైన నేపథ్యంలో కరోనా తీవ్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలతో షేర్ చేసింది. కరోనా యాక్టివ్ కేసుల్లో 5 నుంచి 10 శాతం మంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరాల్సి వస్త్తోంది. సెకండ్ వేవ్ టైమ్‌లో ఇది 20 నుంచి 23 శాతంగా ఉంది. అయితే కరోనా పరిస్థితిలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తున్నాయని.. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా క్రమంగా పెరిగే అవకాశముందని కేంద్ర ఆరోగ్య శాఖ భావిస్తోంది. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ప్రభావంతో కరోనా కేసులు గణనీయంగా పెరిగాయని.. అదే సమయంలో డెల్టా వేరియంట్ ప్రభావం ఇంకా కొనసాగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
ఈ నేపథ్యంలో కరోనా కేసులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ ఉండాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిన కోవిడ్ అడ్వైజరీలో కేంద్ర ఆరోగ్య శాఖ రాజేశ్ భూషణ్ సూచించారు. యాక్టివ్ కేసుల సంఖ్య, హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులు, ఆక్సిజన్ బెడ్స్ అవసరమైన రోగులు, ఐసీయూ బెడ్స్, వెంటిలేషన్ అవసరమైన కోవిడ్ రోగుల సంఖ్యను నిశితంగా పరిశీలిస్తూ.. అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై రోజువారీగా పరిస్థితిని సమీక్షించాలన్నారు.
పరిస్థితులకు అనుగుణంగా హెల్త్ కేర్ రంగంలో మౌలిక వసతులు, మానవ వనరుల అంశాలపై దృష్టిసారించాలన్నారు.
In the present surge, 5-10% of active cases needed hospitalisation so far. The situation is dynamic & evolving, the need for hospitalisation may change rapidly. All States/UTs advised to keep watch on situation of total no. of active cases:Health Secy Rajesh Bhushan to States/UTs pic.twitter.com/vTElVzuumX
— ANI (@ANI) January 10, 2022
Also Read..
కొత్త ఉద్యోగులకు శుభవార్త.. ఆ పథకం ప్రయోజనం పొడగించారు.. ఎప్పటివరకంటే..?
Viral Photo: ఈ ఫోటోలో పాము దాగుంది.. ఈజీగా కనిపెట్టచ్చండోయ్.. కష్టం కాదు.!