AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూతురి ఫీజు కోసం చెప్పులు లేకుండానే పరుగెత్తింది.. 47 ఏళ్ల రమాబాయి స్ఫూర్తిదాయక కథ ఇది..

కూతుళ్ల భవిష్యత్తు కోసం వంట మనిషిగా పనిచేస్తున్న 47 ఏళ్ల రమాబాయి రణ్‌ధీర్‌ ఊహించని రీతిలో మారథాన్‌లో విజయం సాధించారు. మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లా అంబాజోగాయికి చెందిన ఆమె ఎలాంటి ప్రత్యేక శిక్షణ లేకుండానే ‘అమృత్ దౌడ్‌’ మారథాన్‌లో పాల్గొన్నారు. చివరికి చెప్పులు లేకుండా పరుగెత్తి మొదటి స్థానంలో నిలిచి రూ.3 వేల నగదు బహుమతి గెలుచుకున్నారు.

కూతురి ఫీజు కోసం చెప్పులు లేకుండానే పరుగెత్తింది.. 47 ఏళ్ల రమాబాయి స్ఫూర్తిదాయక కథ ఇది..
Maharashtra Woman Runs Marathon
Shaik Madar Saheb
|

Updated on: Sep 01, 2026 | 7:37 AM

Share

నాలుగు పదులు దాటిన వయసు.. సాదాసీదా చీర.. కాళ్లకు మామూలు స్లిప్పర్లు. ఆమెను చూస్తే రేస్‌లో పాల్గొంటుందని ఎవరూ నమ్మరు. కానీ కూతుళ్ల చదువు కోసం వంట మనిషిగా పనిచేస్తున్న 47 ఏళ్ల రమాబాయి రణ్‌ధీర్.. మారథాన్‌లో పాల్గొని విజయం సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా అంబాజోగాయికి చెందిన రమాబాయి.. ఇటీవల భారతీయ శిక్షణ ప్రసారక్‌ సంస్థకు చెందిన విద్యా ప్రాంగణంలో నిర్వహించిన అమృత్ మహోత్సవ్ వేడుకల్లో ‘అమృత్ దౌడ్‌’ మారథాన్‌లో పాల్గొన్నారు. ఎలాంటి ప్రత్యేక శిక్షణ, ముందస్తు సిద్ధత లేకుండానే.. చివరికి చెప్పులు లేకుండా పరుగెత్తి మొదటి స్థానంలో నిలిచి రూ.3 వేల నగదు బహుమతి గెలుచుకున్నారు.

”ప్రతిరోజూ నా పిల్లల భవిష్యత్తు కోసం పరుగెడుతుంటాను.. కానీ ఈ రోజు నా కోసం పరుగెత్తాను” అని రమాబాయి చెప్పారు. రమాబాయికి ఇద్దరు కూతుళ్లు. ఒకరు బీఎస్సీ చదువుతుండగా.. మరో కూతురు పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు సిద్ధమవుతోంది. వారిని చదివించేందుకు హింగోలీ నుంచి అంబాజోగాయికి వచ్చిన ఆమె.. భర్త మరణించిన తర్వాత కుటుంబాన్ని పోషిస్తూ, పిల్లల చదువుకు అవసరమైన డబ్బు కోసం ఓ అకాడమీలో వంట మనిషిగా పనిచేస్తున్నారు.

కూతుళ్ల భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడుతున్న రమాబాయి.. ఇప్పుడు మారథాన్‌లోనూ తన సత్తా చాటారు. ఆమె విజయం చూసి అక్కడున్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం అన్ని వర్గాల నుంచి ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

వీడియో చూడండి..

Follow Us
పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు కొనాలా లేదా వేచి చూడాలా?
పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు కొనాలా లేదా వేచి చూడాలా?
సిల్క్ స్మిత చనిపోయినప్పుడు ఆ ఒక్క హీరో మాత్రమే వచ్చాడు
సిల్క్ స్మిత చనిపోయినప్పుడు ఆ ఒక్క హీరో మాత్రమే వచ్చాడు
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్
వెల్లుల్లి, ఉల్లిపాయలు తింటున్నారా? రాహు కేతువుల ప్రభావం ఉంటుందా?
వెల్లుల్లి, ఉల్లిపాయలు తింటున్నారా? రాహు కేతువుల ప్రభావం ఉంటుందా?
ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు.. భర్తగా రావడం అదృష్టమేనట..!
ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు.. భర్తగా రావడం అదృష్టమేనట..!
యువ నేత సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్.. బోణీ కొట్టిన వైసీపీ
యువ నేత సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్.. బోణీ కొట్టిన వైసీపీ
బిర్యానీ అసలు ఎక్కడ పుట్టింది.. చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు
బిర్యానీ అసలు ఎక్కడ పుట్టింది.. చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు
విమానంలో కుక్క మూత్రం.. పైలట్ విచిత్ర ఆప్షన్ !
విమానంలో కుక్క మూత్రం.. పైలట్ విచిత్ర ఆప్షన్ !
బెట్టింగ్ పిచ్చి.. యూట్యూబ్‌లో చూసి ఈ కేటుగాడు ఏం చేశాడో తెలుసా?
బెట్టింగ్ పిచ్చి.. యూట్యూబ్‌లో చూసి ఈ కేటుగాడు ఏం చేశాడో తెలుసా?
ఆ సినిమా ఎందుకు హిట్ అయ్యిందో నాకే తెలియదు
ఆ సినిమా ఎందుకు హిట్ అయ్యిందో నాకే తెలియదు