స్మోకింగ్ తో కోవిద్ కి లింక్ ! పొగ రాయుళ్లూ ! బీ అలర్ట్ అంటున్న మీరట్ డాక్టర్లు , ముంచుకొస్తున్న థర్డ్ వేవ్ తో కూడా ముప్పే అంటూ హెచ్చరికలు

| Edited By: Phani CH

Jun 02, 2021 | 12:53 PM

యూపీలోని మీరట్ లో ఇటీవలికాలంలో 767 మంది కోవిద్ రోగులు మృతి చెందారు. వీరిలో 320 మంది అంటే 42 శాతం మంది గుప్పు..గుప్పున సిగరెట్లో, బీడీలో, సిగార్లో వాడేవారని త్తెలిసింది.

స్మోకింగ్ తో కోవిద్ కి లింక్ ! పొగ రాయుళ్లూ ! బీ అలర్ట్ అంటున్న మీరట్ డాక్టర్లు , ముంచుకొస్తున్న థర్డ్ వేవ్ తో కూడా ముప్పే అంటూ హెచ్చరికలు
India covid deaths
Follow us on

యూపీలోని మీరట్ లో ఇటీవలికాలంలో 767 మంది కోవిద్ రోగులు మృతి చెందారు. వీరిలో 320 మంది అంటే 42 శాతం మంది గుప్పు..గుప్పున సిగరెట్లో, బీడీలో, సిగార్లో వాడేవారని త్తెలిసింది. ఇంకొందరు పొగాకు ఉత్పత్తులను రకరకాలుగా సేవించేవారని డాక్టర్లు చెబుతున్నారు. అసలే కోవిద్ ఊపిరితిత్తుల మహమ్మారి ! ముక్కు నుంచి నేరుగా ఊపిరి తిత్తులను చేరే వ్యాధి ! ఇది లంగ్స్ ని తాకినప్పుడు స్మోకింగ్ కూడా చేస్తే అది మరింత డేంజర్ అంటున్నారు. హాబిట్యుయల్ స్మోకర్లకు ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుందని..జాగ్రత్త సుమా అని వారు హెచ్చరిస్తున్నారు. కోవిద్ తో బాటు ఇతర సీరియస్ రోగాలు కూడా స్మోకింగ్ లేదా పొగాకు ఉత్పత్తుల సేవనంవల్ల సోకుతాయని పేర్కొంటున్నారు. పైగా థర్డ్ కోవిద్ వేవ్ కూడా ముంచుకొస్తున్న తరుణంలో ఇక స్మోకర్లే దీని ‘టార్గెట్’ గా ఉంటారట. ఈ కారణంగా సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలని, స్మోకింగ్ మానేయాలని, టొబాకో ప్రాడక్ట్స్ కి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ సెకండ్ వేవ్ కి చాలావరకు యూత్ గురయ్యారు.. దేశంలో స్మోక్ చేస్తున్న యువత కూడా ఎక్కువే..ఈ విషయాన్ని వారు ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి అని వైద్య బృందం పదేపదే గుర్తు చేస్తోంది.

స్మోకర్లలో రోగనిరోధక శక్తి కూడా తక్కువే ఉంటుందని, వారు డెడ్లీ వైరస్ ని తట్టుకోవడం కష్టమని ఈ బృందం ఆందోళన వ్యక్తం చేసింది. దేశ వ్యాప్తంగా కోవిద్ కేసులు తగ్గుతున్నప్పటికీ మరోవైపు మరణాల సంఖ్య తగ్గడంలేదు. ఇంచుమించు రోజూ 3 వేలకుపైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ విషయాన్ని విస్మరించరాదంటున్నారు. వచ్చే ఆగస్టు-సెప్టెంబరు మధ్య కాలానికి థర్డ్ వేవ్ రావచ్చునన్నది ఓ అంచనా.. కానీ దీని తీవ్రతను మాత్రం చెప్పలేమంటున్నారు. ఏమైనా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Andhrapradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

Mehul Choksi: బ్రదర్ సెంటిమెంట్…. డొమినికాలో మెహుల్ చోక్సీ సాయానికి వచ్చిన సోదరుడు చేతన్ చోక్సీ ఏం చేశాడంటే …?