కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు శిక్షణ.. ఇమ్రాన్ సంచలన ఆరోపణ

| Edited By: Anil kumar poka

Jul 24, 2019 | 4:17 PM

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓ సంచలన వ్యాఖ్య చేసి దుమారం రేపారు. సుమారు 30 వేల నుంచి 40 వేల మంది టెర్రరిస్టులు ఆఫ్ఘనిస్తాన్ లోనో, కాశ్మీర్ లోనో శిక్షణ పొంది దాడులకు పాల్పడ్డారని, వీరంతా ప్రస్తుతం తమ దేశంలో ఉన్నారని అన్నారు. (అంటే పాక్ గడ్డపై ఉగ్రవాద శిబిరాలున్నాయన్న భారత ఆరోపణను ఆయన అంగీకరించినట్టే అయింది). తన ఆధ్వర్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వాలకు ఈ విషయం […]

కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు శిక్షణ.. ఇమ్రాన్ సంచలన ఆరోపణ
Follow us on

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓ సంచలన వ్యాఖ్య చేసి దుమారం రేపారు. సుమారు 30 వేల నుంచి 40 వేల మంది టెర్రరిస్టులు ఆఫ్ఘనిస్తాన్ లోనో, కాశ్మీర్ లోనో శిక్షణ పొంది దాడులకు పాల్పడ్డారని, వీరంతా ప్రస్తుతం తమ దేశంలో ఉన్నారని అన్నారు. (అంటే పాక్ గడ్డపై ఉగ్రవాద శిబిరాలున్నాయన్న భారత ఆరోపణను ఆయన అంగీకరించినట్టే అయింది). తన ఆధ్వర్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వాలకు ఈ విషయం తెలిసినా ఆ ఉగ్రవాదుల కార్యకలాపాలను అదుపుచేసేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. 2014 లో తాలిబన్లు జరిపిన దాడిలో దాదాపు 150 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినప్పుడే దేశంలో ఉగ్రవాదులను అణచివేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ మేరకు అన్ని పార్టీలు కలిసి కార్యాచరణ రూపొందించాయని వెల్లడించారు. చిత్తశుద్ది లోపించిన గత ప్రభుత్వాల వల్లే ఉగ్రవాదులు పేట్రేగిపోయారని ఆయన పేర్కొన్నారు. యునైటెడ్ స్టేట్స్ పీస్ ఇన్స్ టి ట్యూట్ లో జరిగిన ఓ ఈవెంట్లో ఆయన పాల్గొన్నారు. కాగా అంతకుముందు జరిగిన మరో కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. తమ దేశంలో 40 ఉగ్రవాద గ్రూపులున్నాయని, కానీ.. ఈ నిజాన్ని అమెరికాకు చెప్పలేదని వాపోయారు. ముఖ్యంగా గత 15 సంవత్సరాల్లో ఈ విషయాన్ని వరుసగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు యుఎస్ కు తెలియజేయలేదన్నారు.

ప్రస్తుతం మూడు రోజుల పర్యటనకుగాను అమెరికాలో ఉన్న ఇమ్రాన్ ఖాన్.. ఉగ్రవాదంపై తాము పోరాడుతున్నామని, ఈ అంశంలో అమెరికాతో చేతులు కలిపామని అన్నారు. నవంబర్ 9 న జరిగిన దాడులతో మాకు సంబంధం లేదు.. అల్ ఖైదా మా దేశంలో కాదు.. అది ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది.. అలాగే మా దేశంలో తాలిబన్లు లేరు.. కానీ టెర్రరిజం పై అమెరికా జరుపుతున్న పోరులో మేమూ పాలు పంచుకుంటున్నాం అని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. దురదృష్టవశాత్తూ కొన్ని ఘటనలు తప్పుడుగా జరిగాయని, ఇందుకు తన ప్రభుత్వాన్నే తాను నిందిస్తున్నానని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.

అసలైన వాస్తవాన్ని అమెరికాకు తెలియజేయలేనందుకు చింతిస్తున్నానని అన్నారు. తన గౌరవార్థం మహిళా సెనెటర్ షీలా జాక్సన్ లీ ఇఛ్చిన రిసెప్షన్ లో పాల్గొన్న ఆయన.. పాకిస్తాన్ ప్రభుత్వాలు అసలు కంట్రోల్ లో లేవన్న విషయాన్ని విప్పి చెప్పారు. తమ దేశంలో నలభై మిలిటెంట్ గ్రూపులు పని చేస్తున్నా… ఏంచేయాలో తోచక తనలాంటి వారు వర్రీ అయ్యారని, కానీ వాటిని అదుపు చేయడానికి ఇంకా ఏదో చేయాలని అమెరికా కోరిందని, అందుకే ఈ పోరాటంలో మేము కూడా భాగస్వాములమయ్యామన్నారు. పాకిస్తాన్ తన సొంత మనుగడకోసం పోరాడుతోందని చెప్పిన ఇమ్రాన్.. ఈ దేశాధ్యక్షుడు ట్రంప్ తోను, ఇతర నేతలతోనూ తాను భేటీ కావడం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుందన్నారు.

పాక్-అమెరికా దేశాల మధ్య అపోహలు ఏర్పడడం తననెంతో బాధించిందని, ఇకపై ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా వేరుగా ఉంటాయని పేర్కొన్నారు.