ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాఫ్టర్‌.. 4 ప్రయాణికులు సజీవ దహనం.. మరో ఇద్దరు..

ప్రమాద స్థలంలో మృతదేహాలను స్వాదీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. హెలికాప్టర్ ముక్కలు, ముక్కలుగా పేలిపోయింది. ఆ హెలికాప్టర్ ప్రైవేట్ కంపెనీ ఏరో ట్రింక్ కు చెందినదిగా తెలిసింది. ఏడుగురు ప్రయాణికులతో వెళుతుండగా ప్రమాదానికి గురైంది.

ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాఫ్టర్‌.. 4 ప్రయాణికులు సజీవ దహనం.. మరో ఇద్దరు..
Helicopter Crashes

Updated on: May 08, 2025 | 10:51 AM

చార్‌ధామ్ యాత్ర కోసం బయల్దేరిన హెలికాప్టర్ కూలిపోయింది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నలుగురు సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని తెలిసింది. ఈ మేరకు గర్హ్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ప్రమాదాన్ని ధృవీకరించారు. ఉత్తరకాశి జిల్లాలోని గంగానిలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, పరిపాలన, NDRF-SDRF బృందాలు సంయుక్తంగా సహాయక చర్యలను చేపట్టాయి.

ప్రమాద స్థలంలో మృతదేహాలను స్వాదీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. హెలికాప్టర్ ముక్కలు, ముక్కలుగా పేలిపోయింది. ఆ హెలికాప్టర్ ప్రైవేట్ కంపెనీ ఏరో ట్రింక్ కు చెందినదిగా తెలిసింది. ఏడుగురు ప్రయాణికులతో వెళుతుండగా ప్రమాదానికి గురైంది.

ఇవి కూడా చదవండి

ఉత్తరకాశీ జిల్లాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. ఆయన తన X హ్యాండిల్‌ ద్వారా ట్వీట్ చేస్తూ, SDRF, జిల్లా పరిపాలన బృందాలు వెంటనే సహాయక చర్యల కోసం సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారికి సరైన చికిత్స సదుపాయాలను అందించాలని, ప్రమాదంపై పూర్తి దర్యాప్తు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..