Sindoor: సింధూరం స్వచ్ఛమైనదో, నకిలీదో గుర్తించేదెలా..? అసలు ఎలా తయారు చేస్తారంటే..
కాదేదీ కల్తీకి అనర్హం అన్న సామెతను సార్ధకం చేస్తూ దేశంలో అనేక వస్తువులు, నిత్యవసర వస్తువులు, తినే ఆహారం అన్నింటిలోనూ కల్తీకి తెగబడుతున్నారు కొందరు కేటుగాళ్లు. పాలు, పెరుగు, జున్ను, పండ్లు, కూరగాయలు, ఉప్పు, పప్పు, వంటనూనెలు ఇలా ఒక్కటేమిటీ.. ఈ కలికాలంలో ప్రతిదీ కల్తీమయమే. అరటి, మామిడి, బొప్పాయి వంటి పండ్లు, తియ్యటి చక్కెరలో కెమికల్స్, బెల్లం రంగు, రుచి రావడం కోసం కూడా రసాయనాలు వాడుతున్నారు. చివరకు ఆడవాళ్లు నుదుటన ధరించే సింధూరంలోనూ కల్తీ ఉంటుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మార్కెట్లో నకిలీ సిందూరం దొరుకుతుండటంతో మహిళలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. అసలు, నకిలీ సిందూరాలను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




