Firing in Train: కదులుతున్న రైలులో కాల్పులు.. RPF ASI సహా ముగ్గురు ప్రయాణికులు మృతి

Jaipur-Mumbai Passenger Train: ముంబై-జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో కాల్పులు కలకలం. కాల్పుల్లో ఆర్పీఎఫ్ ఏఎస్‌ఐ సహా నలుగురు మృతి చెందారు. కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ చేతన్‌, ఈ ఉదయం 5 గంటల సమయంలో ఘటన చోటు చేసుకుంది. దహీసర్‌ స్టేషన్‌ సమీపంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. కాల్పులు జరిపిన తర్వాత రైలు నుంచి చేతన్‌ దూకేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Firing in Train: కదులుతున్న రైలులో కాల్పులు.. RPF ASI సహా ముగ్గురు ప్రయాణికులు మృతి
Jaipur Mumbai Passenger Train

Updated on: Jul 31, 2023 | 9:05 AM

Mumbai Train Firing: జైపూర్ ముంబై ప్యాసింజర్ రైలులో జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించారు. ఈ రైలు గుజరాత్ నుంచి ముంబైకి వస్తోంది. మృతుల్లో ఆర్పీఎఫ్ ఏఎస్ఐ సహా ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. ఆర్పీఎఫ్‌కు చెందిన కానిస్టేబుల్ చేతన్ అందరినీ కాల్చిచంపాడు. వాపి-బొరివలిమిరా రోడ్ స్టేషన్ మధ్య ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. మీరా రోడ్ బోరివాలి మధ్య జీఆర్‌పీ ముంబై సిబ్బంది ఆదివారం కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కూడా ప్రయాణికులను ప్రశ్నిస్తున్నారు.  ఘటన ఎలా జరిగిందనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

నిందితుడి ఉద్దేశం ఏంటి..? ఎందుకు కాల్పులు జరిపాడనేది తెలియరాలేదు. అదృష్టవశాత్తూ, ఈ కాల్పుల్లో ఎక్కువ మంది ప్రయాణికులు గాయపడలేదు. కదులుతున్న రైలులో కాల్పులు జరిగిన వెంటనే రైలులో కలకలం రేగింది. ప్రస్తుతం రైలులోని ప్రయాణికుల వాంగ్మూలాలను కూడా పోలీసులు నమోదు చేస్తున్నారు. పోలీసులు మొత్తం కేసు దర్యాప్తు ప్రారంభించారు.

జవాన్ ఒక్కసారిగా కాల్పులు జరపడంతో..

జైపూర్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 12956) కోచ్ నంబర్ B5లో ఈ ఘటన జరిగింది. ఈరోజు తెల్లవారుజామున 5.23 గంటలకు ఈ ఘటన జరిగింది. రైల్లో ఆర్పీఎఫ్ జవాన్, ఏఎస్ఐ ఇద్దరూ ప్రయాణిస్తున్నారు. ఇంతలో కానిస్టేబుల్ చేతన్ అకస్మాత్తుగా ఏఎస్ఐపై కాల్పులు జరపడంతో ప్రయాణిస్తున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

రైల్వే అధికారుల ప్రకటన..

ఈ మేరకు పశ్చిమ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో, ‘పాల్ఘర్ స్టేషన్ దాటిన తర్వాత, కదులుతున్న జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. అతను ఒక ఆర్పీఎఫ్ ఏఎస్ఐ, మరో ముగ్గురు ప్రయాణికులను కాల్చి చంపాడు. దహిసర్ స్టేషన్ సమీపంలో రైలు నుంచి దూకాడు. నిందితుడు కానిస్టేబుల్‌తో పాటు ఆయుధాన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం