POCSO Act: చిన్నారులపై లైంగిక నేరాల నిరోధక చట్టం (పోక్సో) కింద మూడేళ్లలో 4,12,142 అత్యాచార కేసులు నమోదైనట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. గురువారం రాజ్యసభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 35 (2) ప్రకారం నేరం జరిగిన ఏడాది లోపు ప్రత్యేక కోర్టులు కేసుల విచారణ పూర్తి చేయాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 1,023 పాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడానికి ఓ పథకం అమలు చేస్తోందని అన్నారు. అందులో 389 కోర్టులు కేవలం పోక్సో చట్టానికి సంబంధించిన కేసుల విచారణకే కేటాయిస్తున్నామని అన్నారు.
2020 డిసెంబర్ వరకు 609 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పని చేస్తున్నాయని, అందులో పోక్సో చట్టానికి సంబంధించినవి 331 ఉన్నాయని స్మృతి ఇరానీ తెలిపారు. కాగా, దేశంలో బాలికలపై, మహిళపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడిన కామాంధులను కటకటాల వెనక్కి నెట్టినా.. ఇలాంటి వారిలో మార్పు రావడం లేదు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని పోక్సో చట్టం కింద విచారణ త్వరగా పూర్తి చేసి శిక్షలు వేస్తున్నారు. చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నాయి.
Also Read:
ఇందిరాగాంధీ హయాంలో ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేస్తే.. ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేటీకరణ
India vs England, 1st Test, Day 1 LIVE Score: తొలి టెస్ట్ సమరం.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్.