Covid Restrictions: కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ హోటల్‌లో గ్రాండ్‌ పార్టీ.. 37 మంది అరెస్టు.. కార్లు స్వాధీనం

Covid Restrictions: ముందే కరోనా మహమ్మారితో అతలాకుతలం అవుతుంటే.. కొందరు కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. దేశంలో కరోనా మొదలైన నాటి నుంచి కోవిడ్‌ నిబంధనలు..

Covid Restrictions: కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ హోటల్‌లో గ్రాండ్‌ పార్టీ.. 37 మంది అరెస్టు.. కార్లు స్వాధీనం

Edited By: Subhash Goud

Updated on: Jul 11, 2021 | 12:27 PM

Covid Restrictions: ముందే కరోనా మహమ్మారితో అతలాకుతలం అవుతుంటే.. కొందరు కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. దేశంలో కరోనా మొదలైన నాటి నుంచి కోవిడ్‌ నిబంధనలు అమల్లోనే ఉన్నాయి. అయినా కొందరు అవేమి పట్టించుకోకుండా నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాజాగా పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో వీకెండ్‌ పార్టీ నిర్వహిస్తున్న ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌పై ఆదివారం తెల్లవారు జామూన 2 గంటల ప్రాంతంలో పోలీసులు దాడి చేశారు. కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించడంతో 37 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా కరోనా నియమాలు ఉల్లంఘించి పార్టీలో పాల్గొన్నారు. ఈ పార్టీలో పాల్గొన్నవారి నుంచి రెండు కార్లు, 38 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే కార్లలో గంజాయి, మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన కోల్ కతాలోని పార్క్ స్ట్రీట్‌లో గల పార్క్ హోటల్‌లో చోటుచేసుకుంది. అయితే నిబంధనలు ఉల్లంఘించి హోటల్‌లో పార్టీ జరుగుతున్నదని సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆదివారం తెల్లవారు జామున హోటల్‌కు వెళ్లి దాడి చేశారు. కోవిడ్‌ నిబంధనల ఉల్లంఘనలలో 37 మందిని అరెస్టు చేసి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, పశ్చిమబెంగాల్‌లో కోవిడ్‌ ఆంక్షలు కొనసాగతున్నాయి. అక్కడి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జూలై 15 వరకు కోవిడ్‌ ఆంక్షలు పొడిగించింది. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టినా.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం తగ్గడం లేదు. ఇంకా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలను ఎత్తివేశారు. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కోవిడ్‌ కేసులు తగ్గని రాష్ట్రాల్లో ఆంక్షలు పొడిగించారు. పూర్తి స్థాయిలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టే వరకు ఆంక్షలు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేస్తున్నాయి.

 

 

ఇవీ కూడా చదవండి:

జమ్మూకశ్మీర్‌ అనంత్‌నాగ్‌లో ఎన్‌ఐఏ దాడులు.. ఐదుగురు ఉగ్రవాదులు అరెస్టు.. ల్యాప్‌టాప్‌, డాక్యుమెంట్లు స్వాధీనం

India Coronavirus: కాస్త ఊరట.. దేశవ్యాప్తంగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు..