ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు కార్మికులు మృతి.. పలువురికి గాయాలు..

|

Apr 24, 2023 | 5:26 PM

మధ్యాహ్నం 12.30 గంటలకు కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానిక అగ్నిమాపక దళం అధికారులు సమాచారం అందుకున్న వెంటనే నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారికి వెంటనే చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర ముఖ్యమంత్రి.

ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు కార్మికులు మృతి.. పలువురికి గాయాలు..
Fire Accident
Follow us on

నాగ్‌పూర్ నగరంలోని హింగానా ఎంఐడీసీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటల్లో చిక్కుకుని ముగ్గురు కార్మికులు సజీవదహనమైనట్టుగా తెలిసింది. మరో 10 నుంచి 12 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయి ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని హింగానా ఎంఐడీసీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హింగానా MIDCలోని సోనెగావ్ నిపానీలో కటారియా ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఈ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంతో ముగ్గురు కార్మికులు దురదృష్టవశాత్తు మరణించడం పట్ల ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సమన్వయం చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెంటనే నాగ్‌పూర్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి వెంటనే చికిత్స అందించాలని దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశించారు. జిల్లా కలెక్టరు ముంబయిలో మీటింగ్ లో ఉన్నప్పటికీ.. నిత్యం పరిస్థితిపై సమన్వయం చేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే స్థానిక తహసీల్దార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

హింగ్నాలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని కటారియా ఆగ్రో లిమిటెడ్‌లో మధ్యాహ్నం 12.30 గంటలకు మంటలు చెలరేగాయి. స్థానిక అగ్నిమాపక దళం అధికారులు సమాచారం అందుకున్న వెంటనే నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. అయితే, అగ్నిమాపక దళం మంటలను అదుపు చేయడంలో విఫలమవడంతో, నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక విభాగం నుండి సహాయం కోరింది. వెంటనే, పౌర సంస్థ నుండి మరో ఆరు ఫైర్ ఇంజన్లు కూడా సహాయక కార్యకలాపాలలో చేరాయి.

దాదాపు 30 మంది కార్మికులు మంటల్లో చిక్కుకోగా దాదాపు అందరినీ అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. గాయపడిన వారందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరిపరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కాగా, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మంటలు చెలరేగడానికి ముందు కంపెనీలో భారీ పేలుడు సంభవించిందని MIDC సీనియర్ అగ్నిమాపక సిబ్బంది ఆనంద్ పరబ్ అన్నారు. అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..