Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. బడ్గాంలో కశ్మీర్ పండిట్ రాహుల్‌భట్‌ను కాల్చిచంపిన ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. రాహుల్ చనిపోయిన 24 గంటల్లో టెర్రరిస్టుల పనిపట్టింది సైన్యం . బాందీపురలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా రాహుల్‌భట్‌ను చంపిన ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్ చేయాలని కశ్మీర్ పండిట్లు జమ్ముకశ్మీర్‌లోని అన్ని ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు. అంతేకాదు రాహుల్‌భట్ హత్యను నిరసిస్తూ 350 మంది కశ్మీర్ పండిట్లు ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. తమకు భద్రత కల్పించడంతో ప్రభుత్వం విఫలమైందని వాళ్లు ఆరోపిస్తున్నారు. ఈక్రమంలో రాహుల్‌భట్ హత్యకు నిరసనగా కశ్మీర్ పండిట్లు చేపట్టిన ఆందోళనపై పోలీసులు వాటర్ క్యా్న్లు , భాష్పవాయువును ప్రయోగించడంపై తీవ్ర వివాదం చెలరేగింది. కాంగ్రెస్‌తో పాటు విపక్షాలు బీజేపీ తీరును తప్పుపట్టాయి. కశ్మీర్ పండిట్లను బీజేపీ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటోందని కాంగ్రెస్ విమర్శించింది.
కాగా గురువారం నాడు బుడ్గాంలో కశ్మీర్ పండిట్ రాహుల్‌భట్‌ను కాల్చిచంపారు ఉగ్రవాదులు. రాహుల్‌భట్ పనిచేస్తున్న తహసిల్ కార్యాలయంలో ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కార్యాలయం లోకి వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో రాహుల్‌భట్ గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించినప్పటికి లాభం లేకుండాపోయింది. పట్టపగలు ప్రభుత్వ కార్యాలయంలో ఒక ఉద్యోగిని కాల్చిచంపడం కశ్మీర్‌లో తీవ్ర కలకలం రేపింది.
#SrinagarEncounterUpdate: 02 more #terrorists killed (Total 03). #Incriminating materials including arms & ammunition recovered. Search going on. Further details shall follow.@JmuKmrPolice https://t.co/N0TrIUOiAN
— Kashmir Zone Police (@KashmirPolice) March 16, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: