ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు అరెస్ట్..

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు అన్ని దేశాలు ఇప్పుడు ఈ కంటికి కనిపించని వైరస్‌తో యుద్ధం చేస్తున్నాయి. అయితే పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు మాత్రం.. మన దేశంలో అలజడి సృష్టించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరి ప్రయత్నాలకు భారత ఆర్మీ ఎప్పటికప్పుడు చెక్ పెడుతోంది. తాజాగా.. జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులు పట్టుబడ్డారు. సోపోర్ పోలీసులతో కలిసి భద్రతా బలగాలు.. లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు టెర్రరిస్టులను అరెస్ట్ […]

ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు అరెస్ట్..

Edited By:

Updated on: May 31, 2020 | 4:33 PM

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు అన్ని దేశాలు ఇప్పుడు ఈ కంటికి కనిపించని వైరస్‌తో యుద్ధం చేస్తున్నాయి. అయితే పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు మాత్రం.. మన దేశంలో అలజడి సృష్టించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరి ప్రయత్నాలకు భారత ఆర్మీ ఎప్పటికప్పుడు చెక్ పెడుతోంది. తాజాగా..
జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులు పట్టుబడ్డారు. సోపోర్ పోలీసులతో కలిసి భద్రతా బలగాలు.. లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు టెర్రరిస్టులను అరెస్ట్ చేశారు. ఈ సంఘటన సోపోర్- కుప్వారా రహదారి సమీపంలోని శంగర్‌గండ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. అరెస్ట్ అయిన ముగ్గురు ఉగ్రవాదులు ముస్తాక్ అహ్మద్ మీర్, ముదస్సీర్ అహ్మద్ మీర్, అతర్‌ షమస్ మీర్‌గా గుర్తించారు. వీరి వద్ద నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని అధికారులు తెలిపారు.