ఆక్సిజన్ ఢిల్లీకి రాకుండా ఆపవద్దని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ దీనంగా కోరుతున్నారు. ఢిల్లీలో తాను చికిత్స పొందుతున్న బెడ్ పై నుంచే ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. కేంద్రం ,హర్యానా ప్రభుత్వం రెండూ కూడా దయార్ద్ర హృదయంతో ఆక్సిజన్ పంపేలా చూడాలని ఆయన అభ్యర్థించారు. తాను అడ్మిట్ అయిన హాస్పిటల్ లో ఆక్సిజన్ 3 గంటలకు సరిపడా మాత్రమే ఉందని, ఈ మాస్క్ తీసేస్తే తాను ఈతరాని వాడిని చెరువులో తోసివేసినట్టే ఉంటుందని ఆయన అన్నారు. గ్రేటర్ కైలాష్ ఎమ్మెల్యే అయిన భరద్వాజ్.. చాలామంది రోగులు ఆక్సిజన్ పైనే ఆధారపడి ఉన్నారని, దీన్ని తొలగిస్తే వారి పరిస్థితి నీరు లేని చోట చేపలు చనిపోయినట్టే ఉంటుందని అన్నారు. పెద్ద మనసు చేసుకుని కేంద్రం హర్యానా ప్రభుత్వం కూడా వెంటనే ఆక్సిజన్ పంపేలా చూడాలని ఆయన మరీమరీ కోరారు.
నగరంలోని అనేక ఆసుపత్రుల్లో దాదాపు ఇదేవిధమైన పరిస్థితి నెలకొని ఉంది. ఆక్సిజన్ సరఫరా పై కేంద్రం వెంటనే ఓ పాలసీని రూపొందించాలని, నిర్దిష్ట కార్యాచరణకు పూనుకోవాలని సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు కూడా కేంద్రానికి సూచించాయి. అటు ప్రధాని మోదీ శుక్రవారం నాటి తన బెంగాల్ ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. అన్ని ఆసుపత్రులకు ఆక్సిజన్ అందేలా యుధ్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
केंद्र सरकार और हरियाणा सरकार बड़ा दिल दिखाएं। ऑक्सीजन के बिना लोग मर रहे हैं,। राज धर्म निभाएं। pic.twitter.com/SPXogI3JXT
— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) April 22, 2021
మరిన్ని ఇక్కడ చూడండి: Tollywood : టాలీవుడ్‌ను కాటేస్తున్న కరోనా మహమ్మారి… కోవిడ్‌తో తెలుగు ఇండస్ట్రీ ఎన్ని కోట్లు నష్టపోయిందంటే..!