Elections: ఎత్తు 3 అడుగులే..! అయితేనేం.. కొండంత ఆత్మవిశ్వాసంతో ఎన్నికల బరిలోకి..

|

Apr 19, 2023 | 10:53 AM

ప్రధాన పార్టీలకు చెందిన పలువురు నాయకులు ప్రజాసమస్యలు వినేందుకు కూడా సిద్ధంగా లేనప్పుడు.. తాను ప్రజలకు అండగా నిలుస్తానని, వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తానని తన నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు సవాల్ విసిరారు. ఇంకా విశేషమేమిటంటే,

Elections: ఎత్తు 3 అడుగులే..! అయితేనేం.. కొండంత ఆత్మవిశ్వాసంతో ఎన్నికల బరిలోకి..
Pravesh Chawla
Follow us on

ఉత్తరప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ స్వతంత్ర అభ్యర్థి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారారు. దానికి కారణం అతని ఎత్తు.3 అడుగుల 8 అంగుళాల ఎత్తు గల పర్వేష్ చావ్లా.. స్థానిక ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తాననే పట్టుదలతో రంగంలోకి దిగి మాస్‌ను ప్రదర్శిస్తున్నాడు. మొరాదాబాద్‌లోని ఆదర్శ్ నగర్ పంజాబీ కాలనీలోని 21వ వార్డు నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. అందుకోసం నామినేషన్ దాఖలు చేసి ఓట్ల సేకరణలో చురుగ్గా పాల్గొంటున్నారు.

ప్రజల గొంతుకగా వ్యవహరించేందుకే రాజకీయాల్లోకి వచ్చినట్లు పర్వేష్ చావ్లా గొప్పగా చెప్పారు. తన ఎత్తుకు మరుగుజ్జు కావొచ్చు కానీ.. రాజకీయాల్లో మాత్రం నేను ఎన్నో ఎత్తులు ఛేస్తానన్న నమ్మకం ఉందన్నారు. ప్రజలు తమ శరీర ఆకృతితో బలహీనంగా భావిస్తారు. కానీ దాన్ని బలంగా మార్చుకుని ఎన్నికల్లో గెలుస్తానని ఓట్లు సేకరిస్తున్నాడు. ఆయనను చూసి ఆ ప్రాంత ప్రజలు ఘనస్వాగతం పలికి అభినందనలు తెలిపారు. అందరూ అతనితో చిరునవ్వుతో మాట్లాడుతున్నారు. ఈ లోకంలో పోరాడి జీవించాలి. అలా కాకపోతే తొక్కేస్తారు అంటూ పర్వేష్ కూడా పంచ్ డైలాగ్స్ విసురుతున్నాడు.

Pravesh Chawla

పర్వేష్ చావ్లా డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ నిలబడలేదు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన గత రెండేళ్లుగా పనిచేస్తున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన పలువురు నాయకులు ప్రజాసమస్యలు వినేందుకు కూడా సిద్ధంగా లేనప్పుడు.. తాను ప్రజలకు అండగా నిలుస్తానని, వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తానని తన నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు సవాల్ విసిరారు.  అతని కుటుంబం కూడా అతనికి మద్దతు ఇస్తుంది. స్థానిక ఎన్నికల్లో పర్వేష్ చావ్లా గెలిచినా గెలుపొందకపోయినా.. తన వర్గీయుల మనసు గెలుచుకోవడం మాత్రం ఖాయం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..