G20 Meet: ఈరోజు ఒడిషాలో నిర్వహించనున్న రెండవ జీ20 సాంస్కృతిక సమావేశం

రెండవ సాంస్కృతిక కార్యవర్గ సమూహ సమావేశం ఈ రోజు ఒడిషాలోని భూవనేశ్వర్‌లో నిర్వహించనున్నారు. మే 14 నుంచి మే 17 వరకు సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి జీ20కి చెందిన సభ్యులు, అతిథి దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థలు హాజరుకానున్నాయి. సాంస్కృతిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి మరింత లోతుగా పని చేసేందుకు ఈ సమావేశం అవకాశం కల్పించనుంది.

G20 Meet: ఈరోజు ఒడిషాలో నిర్వహించనున్న రెండవ జీ20 సాంస్కృతిక సమావేశం
G20 Meet

Updated on: May 14, 2023 | 8:05 AM

రెండవ సాంస్కృతిక కార్యవర్గ సమూహ సమావేశం ఈ రోజు ఒడిషాలోని భూవనేశ్వర్‌లో నిర్వహించనున్నారు. మే 14 నుంచి మే 17 వరకు సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి జీ20కి చెందిన సభ్యులు, అతిథి దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థలు హాజరుకానున్నాయి. సాంస్కృతిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి మరింత లోతుగా పని చేసేందుకు ఈ సమావేశం అవకాశం కల్పించనుంది. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని మొదటి సాంస్కృతిక కార్యవర్గ సమూహ సమావేశం జరిగిన అనంతరం ఈ రెండవ సాంస్కృతిక కార్యవర్గ సమావేశాన్ని ఒడిషాలో నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశం ముఖ్యంగా నాలుగు అంశాలపై దృష్టి సారించింది. అవి 1. సాంస్కృతిక ఆస్తుల రక్షణ, పునరుద్ధరణ, 2. స్థిరమైన భవిష్యత్తు కోసం జీవన వారసత్వాన్ని ఉపయోగించడం, 3.సాంస్కృతిక మరియు సృజనాత్మక పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం, 4. సాంస్కృతిక రక్షణ, ప్రోత్సాహం కోసం డిజిటల్ టెక్నాలజీల వినియోగం.

అయితే ఈరోజన ఒడిషాలోని పూరి బీచ్ వద్ద పద్మశ్రీ అవార్డు గ్రహిత సుదర్శని పట్నాయక్ ఇసుక కళ ప్రదర్శనను రూపొదించనున్నారు. అలాగే ‘సంస్కృతి అందరిని ఏకం చేస్తుంది’ అనే థిమ్‌ను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, సాంస్కృతిక, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆవిష్కరించనున్నారు. భారత జీ20 వర్కిగ్ గ్రూప్ చేపట్టిన కల్చర్ యునైట్ల్ ఆల్ అనే ప్రచారం.. విభిన్న సంస్కృతులు, వర్గాల మధ్య శాంతియుత సహజీవనం ఆధారంగా బహుపాక్షికతపై భారతదేశ సుస్థిరమైన నమ్మకాన్ని ఆకర్షిస్తుంది. అయితే ఈ సమావేశానికి వచ్చే ప్రతినిధులకు కోనార్క్ సన్ టెంపుల్, యునేస్కో వరల్డ్ హెరిటెజ్ సైట్, ఉదయగిరి గుహలు వంటి వారసత్వ ప్రదేశాలను చూపించనున్నారు. అలాగే ఒడిషాకు చెందిన గిరిజనుల ప్రత్యేక నృత్య ప్రదర్శనలు కూడా వీక్షిస్తారు. మే 15న జీ20 లో భాగంగా నిర్వహించనున్న సస్టేయిన్ అనే ఎగ్జిబిషన్‌ను ఒడిషా సీఎం నవీవ్ పట్నాయక్, అర్జున్ రామ్ మెగ్వాల్, హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ప్రారంభించనున్నారు. ఈ ఎగ్జిబిషన్‌ మే 16 నుంచి 22 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి