Patna Serial blast case: 9 మందిని దోషులుగా తేల్చిన ఎన్‌ఐఏ.. నవంబర్‌1 న శిక్ష ఖరారు..

|

Oct 27, 2021 | 3:49 PM

2013 పట్నా వరుస బాంబు పేలుళ్ల కేసులో 10 మంది నిందితులకు గానూ 9 మందిని ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. సరైన .

Patna Serial blast case: 9 మందిని దోషులుగా తేల్చిన ఎన్‌ఐఏ.. నవంబర్‌1 న శిక్ష ఖరారు..
Follow us on

2013 పట్నా వరుస బాంబు పేలుళ్ల కేసులో 10 మంది నిందితులకు గానూ 9 మందిని ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. సరైన సాక్ష్యాధారాలు లేక పోవడంతో మరో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది. ఈమేరకు కేసు పూర్వపరాలిలా ఉన్నాయి… 2013 సాధారణ ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ అక్టోబర్‌ 27న పట్నాలోని గాంధీ మైదాన్‌లో ‘హుంకార్‌’ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించ తలపెట్టారు. అయితే ర్యాలీ ప్రారంభం కావడానికి ముందే సభా ప్రాంగణం సమీపంలో వరుసగా బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా…సుమారు 90 మందికి పైగా గాయపడ్డారు.

మోదీ రావడానికి 20 నిమిషాల ముందే..
దుండగులు గాంధీ మైదాన్‌లోని సభా ప్రాంగణంలో మొత్తం ఆరు బాంబులు అమర్చారు. అందులో రెండు బాంబులు మోదీ మాట్లాడే ప్రధాన వేదికకు కేవలం 150 మీటర్ల లోపే పేల్చారు. నరేంద్రమోదీతో పాటు ఇతర బీజేపీ నేతలు సభాప్రాంగణంలోకి అడుగుపెట్టడానికి కేవలం 20 నిమిషాల ముందే ఆఖరి బాంబు పేలడం గమనార్హం. దుండుగులు ఎంతో ప్రమాదకరమైన IED లతో పాటు అమ్మోనియం నైట్రేట్‌, డిబోనేటర్లు, టైమర్లు, ఇనుప మేకులను ఉపయోగించి ఈ పేలుళ్లకు పాల్పడ్డారని అప్పటి ఇంటెలిజెన్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఈ కేసును విచారించిన ఎన్‌ఐఏ 2014లో తొమ్మిది మంది ఇండియన్‌ ముజాహిదీన్‌, స్టూడెంట్స్ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత ఈ పేలుడుకు ప్రణాళిక రచించిన ప్రధాన సూత్రధారులు హైదర్‌ అలీ అలియాస్‌ ‘బ్లాక్‌ బ్యూటీ’, తౌఫిక్‌ అన్సారీ, మోజిబుల్లా, నుమాన్‌ అన్సారీలను అరెస్ట్‌ చేసింది. దోషులుగా తేలిన వారికి నవంబర్‌1 న శిక్ష ఖరారు కానుంది.

Also Read:

Indian Oil LPG: మార్కెట్‌లోకి కొత్త ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్.. వినియోగం తక్కువ.. సమయం ఆదా.. మరెన్నో ప్రత్యేకతలు..

Marital Life: ఇదే అసలైన దాంపత్య జీవితం.. భార్య చివరి కోరిక నెరవేర్చిన భర్త.. ఏం చేశాడో తెలుసా..?

Amarinder Singh: సిద్ధూ ఎక్కడి నుంచి పోటీ చేసినా వదలం.. కొత్త పార్టీపై అమరీందర్ సింగ్ కీలక ప్రకటన