Jallikattu: జల్లికట్టు పోటీల్లో చిందిన రక్తం.. ప్రారంభ వేడుకల్లోనే 20 మందికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషయం..

|

Jan 08, 2023 | 12:07 PM

తచంకురిచిలో ఈ ఉదయం ప్రారంభమైన పోటీల్లో 20మందికి గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Jallikattu: జల్లికట్టు పోటీల్లో చిందిన రక్తం.. ప్రారంభ వేడుకల్లోనే 20 మందికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషయం..
Jallikattu
Follow us on

తమిళనాడు పుదుకోట్టైలో జరుగుతున్న జల్లికట్టు పోటీల్లో రక్తం చిందింది. తచంకురిచిలో ఈ ఉదయం ప్రారంభమైన పోటీల్లో 20మందికి గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జల్లికట్టు పోటీలకు అనుమతివ్వాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది ప్రభుత్వం. కొన్ని పరిమితులతో పోటీలకు పర్మిషనిచ్చింది. దీంతో పుదుకొట్టై తచంకురిచి నుంచి జల్లికట్టు పోటీలను ప్రారంభించారు. భారీ భద్రత మధ్య జల్లికట్టు నిర్వహిస్తున్నారు. కానీ ప్రారంభంలోనే అపశృతి దొర్లింది. ఒక్కసారిగా ఎద్దులు దూసుకురావడంతో 20మందికి గాయాలయ్యాయి.

అంతకు ముందు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీలతో జరిపిన శాంతి చర్చల్లో జల్లికట్టు నిర్వహణకు అనుమతులు లభించగా.. ఈ సందర్భంలో, ఉదయం నుంచి జల్లికట్టు ప్రారంభమవుతుంది. తంగకురిచ్చి జల్లికట్టు పోటీలను మంత్రులు రఘుపతి, మెయ్యనాథన్, జిల్లా కలెక్టర్ కవిత ప్రారంభించారు.

జల్లికట్టు రెండో రౌండ్‌ పూర్తికాగా, ఇప్పటి వరకు 20 మంది పశువులు తీవ్రంగా గాయపడ్డారు. జల్లికట్టులో గెలుపొందిన క్రీడాకారులకు బైక్‌లు, బహుమతులు అందజేయనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం