మరో విషాదం.. విద్యార్థులతో వెళ్తున్న బస్సు- ట్రక్కు ఢీ.. ఇద్దరు మృతి, 35 మందికి గాయాలు

|

Jun 05, 2023 | 1:37 PM

మృతులను ఆర్టిస్ట్ అమన్, బస్సు డ్రైవర్ కరణ్ యాదవ్ గా గుర్తించినట్టుగా వెల్లడించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

మరో విషాదం.. విద్యార్థులతో వెళ్తున్న బస్సు- ట్రక్కు ఢీ.. ఇద్దరు మృతి, 35 మందికి గాయాలు
Accident
Follow us on

ఒడిశాలో జరిగిన ట్రైన్‌ ప్రమాద సంఘటన యావత్‌ దేశాన్ని కుదిపేసింది. ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వందల సంఖ్యలో మృతిచెందిన వారి బంధువులు, కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వర్ణనాతీతంగా మారాయి. ఇప్పటికే గుర్తు తెలియని మృతదేహాలు కూడా మార్చురీల్లోనే ఉన్నాయి. అంతలోనే మధ్యప్రదేశ్‌లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ లో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  విద్యార్థులతో వెళ్తున్న బస్సు- ట్రక్కు ఢీకొని ఇద్దరు మృతి ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 35 మంది గాయ‌ప‌డ్డారు. వనవాసి లీలా కార్యక్రమంలో భాగంగా ‘లక్ష్మణ్ లీలా’ నాటకం ప్రదర్శించి గ్వాలియర్ నుంచి అగర్ పట్టణానికి వెళ్తున్న నర్మదాపురం డివిజన్ కు చెందిన విద్యార్థులు, కళాకారులతో కూడిన‌ బస్సు ప్రమాదానికి గురైందని స్థానిక పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు. వనవాసి లీలా కార్యక్రమంలో భాగంగా ‘లక్ష్మణ్ లీలా’ నాటకం ప్రదర్శించి గ్వాలియర్ నుంచి అగర్ పట్టణానికి వెళ్తున్న నర్మదాపురం డివిజన్ కు చెందిన విద్యార్థులు, కళాకారులతో బస్సు ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు.

శివపురి శివార్లలోని ఓ ఫ్యాక్టరీ సమీపంలో ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు టైర్లలో ఒకటి అకస్మాత్తుగా పేలడంతో డ్రైవర్ వాహ‌నంపై నియంత్రణ కోల్పోవడంతో వేగంగా వచ్చిన ట్రక్కు బస్సును పక్క నుంచి ఢీకొట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతులను ఆర్టిస్ట్ అమన్, బస్సు డ్రైవర్ కరణ్ యాదవ్ గా గుర్తించినట్టుగా వెల్లడించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..