మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. ఇద్దరు కాంగ్రెస్ శాసనసభ్యులు సోమవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. రాజ్‌కుమార్ ఇమో సింగ్, యమ్‌థాంగ్ హౌకిప్ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, మణిపూర్ పార్టీ ఇంచార్జ్ సంబిత్ పాత్ర సమక్షంలో బీజీపీలో చేరారు. ఇమో సింగ్ రాష్ట్రంలోని ఒక ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. వీరి కుటుంబం కాంగ్రెస్‌తో అనుబంధం కలిగి ఉంది. ఆయన కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలిచినప్పపటికీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు.
దేశ శ్రేయస్సు, శాంతి, సుస్థిరత కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో కృషి చేశారని ఇమో సింగ్ చెప్పారు. తన తండ్రి రాజ్‌కుమార్ జైచంద్ర సింగ్ మణిపూర్ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రానికి చెందిన తొలి కేంద్ర మంత్రిగా పనిచేశారని తెలిపారు. ఇమో సింగ్ ప్రస్తుత మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్‌కి అల్లుడు. సోనోవాల్ వారిని పార్టీలోకి స్వాగతించారు. మోడీ ప్రభుత్వంలో ఈశాన్య ప్రాంతాలకు గుర్తింపు లభించిందని చెప్పారు. మణిపూర్‌లో 2017లో తొలిసారిగా బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆదివారం జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై చర్చించారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాషాయ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Shri @imosingh called upon BJP National President Shri @JPNadda after joining BJP at party headquarters in New Delhi. pic.twitter.com/i5UoXoQXBS
— BJP (@BJP4India) November 8, 2021
Read Also.. LK Advani: అలా ఎందుకు చేశారో ఎల్కే అద్వానీని అడగండి.. BJP నేతలకు SP నేత కౌంటర్