మోర్బీ విషాదం వీడకముందే మరో దుర్ఘటన.. 100 మంది కార్మికులు ఉన్న ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం!

|

Nov 01, 2022 | 1:01 PM

ఆ ఏరియాలోని చెప్పులు, షూస్‌ తయారు చేసే ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. కొందరికి గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు సేకరించే పనిలో పడ్డారు స్థానిక పోలీసులు, అధికార యంత్రాంగం.

మోర్బీ విషాదం వీడకముందే మరో దుర్ఘటన.. 100 మంది కార్మికులు ఉన్న ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం!
Narela Plastic Factory
Follow us on

మోర్బీలో జరిగిన ఘోర ప్రమాదం మరువకముందే ఢిల్లీలోని నరేలాలో మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. నరేలాలోని చెప్పుల ఫ్యాక్టరీలోని మూడో అంతస్తులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఇద్దరు వ్యక్తులు మరణించినట్టుగా తెలిసింది. భవనం నుంచి 20 మందిని సురక్షితంగా తరలించారు. క్షతగాత్రులను కాలిన గాయాలతో స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ఇప్పటి వరకు 10 ఫైరింజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నాయి. కర్మాగారంలోని మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. మరికొన్ని మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. మంటలు చెలరేగినప్పుడు అక్కడ 100 మంది కార్మికులు పని చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మెట్లపై ఉన్న కార్మికులను రక్షించారు. ఇంకా చాలా మంది లోపల చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.

నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలోని చెప్పులు, షూస్‌ తయారు చేసే ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. కొందరికి గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.. పలువురికి  స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరు వ్యక్తులు మరణించారని, వారి వివరాలు సేకరించే పనిలో ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఉదయం 8.30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. మొదట్లో చిన్నగా ఉన్న మంటలు కొద్దిసేపటికే పెద్ద ఎత్తున చెలరేగాయి. 9.30 గంటలకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి