PM Modi: ఆ చీతాలకు స్వేచ్ఛ.. క్వారంటైన్‌ తర్వాత అడవిలోకి.. వీడియో షేర్‌ చేసిన నరేంద్ర మోదీ..

|

Nov 06, 2022 | 9:38 AM

అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉన్న చిరుతల సంఖ్యను దేశంలో మళ్లీ పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆఫ్రికా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 5 దశాబ్దాల తర్వాత ఈ చీతాలు భారత భూభాగంలో అడుగుపెట్టాయి...

PM Modi: ఆ చీతాలకు స్వేచ్ఛ.. క్వారంటైన్‌ తర్వాత అడవిలోకి.. వీడియో షేర్‌ చేసిన నరేంద్ర మోదీ..
Cheetahs Released
Follow us on

అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉన్న చిరుతల సంఖ్యను దేశంలో మళ్లీ పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆఫ్రికా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 5 దశాబ్దాల తర్వాత ఈ చీతాలు భారత భూభాగంలో అడుగుపెట్టాయి. ఈ ప్రాజెక్ట్‌కు భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇచ్చింది. ఏకంగా ప్రత్యేక విమానంలో చీతాలను భారత్‌కు తరలించారు. నమిబీయా నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌కు మొత్తం 8 చిరుతలను తీసుకొచ్చారు.

పులుల సంరక్షణ కోసం ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఆఫ్రికా నుంచి వచ్చిన పులులను క్వారంటైన్‌లో ఉంచారు. సీసీటీవీ కెమెరాలతో నిత్యం వాటిని గమనిస్తున్నారు. కొత్త వాతావరణానికి పులులు ఎలా స్పందిస్తున్నాయి. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాయి లాంటి వివరాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే క్వారంటైన్‌లో ఉన్న పులులను తొలిసారి అడవిలోకి వదిలేశారు.

ఇవి కూడా చదవండి

ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. రెండు చీతాలు క్వారంటైన్‌ను వీడి అడవిలోకి వెళ్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోను షేర్‌ చేస్తూ.. ‘గొప్ప వార్త.. క్వారంటైన్‌ ముగిసిన తర్వాత కునో అటవీ ప్రాంతలోకి రెండు పులులు ప్రవేశించాయి. త్వరలోనే మిగతా వాటిని కూడా విడుదల చేస్తారు. అన్ని చీతాలు ఆరోగ్యంగా, చలాకీగా ఉండడం సంతోషకరం’ అని రాసుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..