Black Fungus Cases: వణికిస్తున్న బ్లాక్‌ ఫంగస్‌.. ఆ రాష్ట్రంలో ఒకే రోజు 133 ఫంగస్‌ కేసులు.. 18 మంది మృతి..!

Black Fungus Cases: ఒక వైపు కరోనా మహమ్మారి విజృంభణ.. మరో వైపు బ్లాక్‌ ఫంగస్‌ వెంటాడుతోంది. ఏడాది కాలంగా కరోనాతో ఇబ్బందులు పడుతూ దాని నుంచి పూర్తిగా బయటపడకముందే..

Black Fungus Cases: వణికిస్తున్న బ్లాక్‌ ఫంగస్‌.. ఆ రాష్ట్రంలో ఒకే రోజు 133 ఫంగస్‌ కేసులు.. 18 మంది మృతి..!
Black Fungus

Updated on: May 29, 2021 | 8:19 AM

Black Fungus Cases: ఒక వైపు కరోనా మహమ్మారి విజృంభణ.. మరో వైపు బ్లాక్‌ ఫంగస్‌ వెంటాడుతోంది. ఏడాది కాలంగా కరోనాతో ఇబ్బందులు పడుతూ దాని నుంచి పూర్తిగా బయటపడక ముందే సెకండ్‌వేవ్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండగా, కోవిడ్‌కు తోడు బ్లాక్‌ ఫంగస్‌ వచ్చి చేరడంతో భయాందోళన వ్యక్తం అవుతోంది. కరోనాతో పాటు బ్లాక్‌ ఫంగస్‌ అంటేనే జనాలు జంకుతున్నారు. ఇక హర్యానా రాష్ట్రంలో కరోనాతో పాటు బ్లాక్‌ ఫంగస్‌ చేసుకులు అధికమవుతున్నాయి. ఆ రాష్ట్రంలో నిన్న కొత్తగా 133 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 18 మంది బ్లాక్‌ ఫంగస్‌తో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇక రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసుల సంఖ్య 756కు చేరింది. వీరిలో 648 మంది బాధితులు వివిధ వైద్య కళాశాలల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు వ్యాధి నుంచి 58 మంది బాధితులు కోలుకున్నారు. ఇదిలా ఉండగా, హర్యానాలో కరోనా వ్యాక్సిన్‌తో పాటు బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సలో ఉపయోగించే ఇంజెక్షన్ల కొరత తీవ్రంగా ఉంది. ఏప్రిల్ చివరి వారంలో రాష్ట్రానికి 66 లక్షల కరోనా వ్యాక్సిన్లకు ఆర్డర్‌ చేయగా, అందులో ఐదో వంతు మాత్రమే వచ్చాయి. మరోవైపు కోవిడ్‌ వ్యాక్సిన్లు, బ్లాక్‌ ఫంగస్‌ ఇంజెక్షన్ల కొరతను తీర్చడానికి ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్‌ను ఆహ్వానించింది. కరోనా వ్యాక్సిన్‌ కోటి డోసులు, 15 వేల బ్లాక్‌ ఫంగస్‌ కోసం టెండర్‌ జారీ చేసింది ప్రభుత్వం.

ఇవీ కూడా చదవండి:

Anandaiah Medicine: ఆనందయ్య మందుపై కొనసాగుతున్న విచారణ.. నేడు తుది నివేదిక: ఆయుష్‌ కమిషనర్‌ రాములు

Good News: కరోనా మహమ్మారి పోరాటంలో మరింత పురోగతి.. కోవిడ్‌ను జయించే వారి సంఖ్య ఎక్కువే..!