Kerala Zika virus Cases: దేశంలో ఇప్పటికే కరోనావైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో, కరోనా వేరియంట్లు, జికా వైరస్ అలజడి సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో కేరళలో మరో జికా వైరస్ కేసు నమోదయ్యింది. దీంతో కలిపి రాష్ట్రంలో మొత్తం జికా బాధితుల సంఖ్య 15కు చేరినట్లు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఆదివారం ఉదయం వెల్లడించారు. నంతన్‌కోడ్‌కు చెందిన ఓ 40 ఏండ్ల వ్యక్తిలో లక్షణాలు కనిపించడంతో అతని నుంచి నమూనాలు సేకరించామన్నారు. ఆ నమూనాలను అల్లాపూజాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించామని.. రిపోర్టులో అతనికి పాజిటివ్ వచ్చినట్లు ఆమె వెల్లడించారు.
మిగిలిన 14 మంది తిరువనంతపురానికి చెందినవారని వీణా జార్జ్ పేర్కొన్నారు. జికా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆమె పేర్కొన్నారు. కాగా.. తిరువనంతపురంలో జికా వైరస్ లక్షణాలు ఉన్న 17 మంది నమూనాలను పరీక్షించగా.. అందులో 14 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయిన విషయం తెలిసిందే.
జికా వైరస్ ఏడిస్ ఈజిప్టి దోమల ద్వారా వ్యాపిస్తుంది. జికా వైరస్‌ను 1947లో కోతుల్లో మొదటిసారి గుర్తించారు. 1952లో ఉగాండాలో మనుషుల్లో గుర్తించారు. జికా సోకితే జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కండరాల నొప్పి, నీరసం లాంటి లక్షణాలు కనిస్తాయి. కాగా.. కేరళలో కరోనావైరస్ కూడా విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య భారీగా పెరుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 14,087 కరోనా కేసులు నమోదయ్యాయి.
Also Read: