కర్ణాటకలో ‘144 సెక్షన్’..!

| Edited By:

Jul 23, 2019 | 8:42 PM

కర్ణాటకలో 144 సెక్షన్ విధించారు. రేపు, ఎల్లుండి.. రెండు రోజుల పాటు ఈ సెక్షన్ కొనసాగనుంది. కాసేపటి క్రితమే.. సంకీర్ణ ప్రభుత్వం కూలడంతో బెంగుళూరు నగరంలో 144 సెక్షన్ విధించారు. కర్ణాటకలో.. ప్రభుత్వం కూలడంతో.. అల్లర్లు చెలరేగే అవకాశమున్నందున ఈ సెక్షన్‌ను అమలులోకి తెచ్చారు. ఈ సందర్భంగా.. రెండు రోజుల పాటు బార్లు, పబ్బులు, వైన్‌ షాప్స్.. వీలైతే పాఠశాలలు కూడా మూసివేయనున్నారు. సభలో మెజార్టీకి కావాల్సిన మేజిక్ ఫిగర్ 103 కాగా. సభకు హాజరైన బీజేపీ […]

కర్ణాటకలో 144 సెక్షన్..!
Follow us on

కర్ణాటకలో 144 సెక్షన్ విధించారు. రేపు, ఎల్లుండి.. రెండు రోజుల పాటు ఈ సెక్షన్ కొనసాగనుంది. కాసేపటి క్రితమే.. సంకీర్ణ ప్రభుత్వం కూలడంతో బెంగుళూరు నగరంలో 144 సెక్షన్ విధించారు. కర్ణాటకలో.. ప్రభుత్వం కూలడంతో.. అల్లర్లు చెలరేగే అవకాశమున్నందున ఈ సెక్షన్‌ను అమలులోకి తెచ్చారు. ఈ సందర్భంగా.. రెండు రోజుల పాటు బార్లు, పబ్బులు, వైన్‌ షాప్స్.. వీలైతే పాఠశాలలు కూడా మూసివేయనున్నారు.

సభలో మెజార్టీకి కావాల్సిన మేజిక్ ఫిగర్ 103 కాగా. సభకు హాజరైన బీజేపీ ఎమ్మెల్యేలు 105 మంది ఉన్నారు. మరో వైపు రెబల్స్‌ తిరుగుబాటుతో మైనార్టీలో పడిపోయిన కాంగ్రెస్‌-జేడీఎస్‌ సభ్యుల సంఖ్య కేవలం 101 మాత్రమే ఉంది. కాగా స్పీకర్‌, నామినేటేడ్‌ ఎమ్మెల్యేలను తీసివేస్తే అధికారపక్షం బలం 99కి పరిమితం అయ్యింది. 15 మంది రెబల్స్‌, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరు అయ్యారు. డివిజన్ పద్ధతిలో ఓటింగ్ జరిగింది. హెడ్ కౌంట్ ద్వారా సభ్యులను లెక్కించారు. విశ్వాస పరీక్షలో అధికార పక్షం ఓట్లు 99 కాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా 105 ఓట్లు దక్కాయి. కాగా.. ఒకవేళ ఈరోజు సాయంత్రం చర్చ అనంతరం కుమారస్వామి రాజీనామా చేస్తే.. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందుగానే ఈ 144 సెక్షన్ విధించారు.