
14 ఏళ్ల బాలుడు ఏకంగా ఓ అడవి పందితోనే తలబడి తన ప్రాణాలు కాపాడుకున్న ఘటన ఒడిశాలోని కటక్ జిల్లాలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో ఆ బాలుడి ధైర్య సహసాలు చూసిన నెటిజన్లు ఆపద ఎదురైనప్పుడు.. సమయస్పూర్తితో వ్యవహరిస్తే.. ఎంతటి ప్రమాదం నుంచైన ఈజీగా తప్పించుకోవచ్చని నిరూపించారని కామెంట్స్ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. గోపాల్‌పుర్ గ్రామానికి చెందిన సుమన్ అనే యువకుడు స్థానికంగా ఉన్న ఓ కాలువ పక్కనుంచి నడుచుకుంటూ పొలానికి వెళ్తున్నాడు.. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ అడవిపంది వేగంగా బాలుడిపైకి దూసుకొచ్చింది. అది గమనించిన సమన్ ఆ పంది నుంచి తప్పించుకోవడానికి వెంటనే పక్కనే ఉన్న కాలువలోకి దూకేశాడు. అయితే ఆ పంది కూడా బాలుడిని వెంబడించే క్రమంలో కాలువలోకి దూకేసింది. అదే అదునుగా భావించిన సుమన్.. ఆ పంది నోటిని గట్టిగా ఒడిపి పట్టుకున్నాడు.
ఆ పంది తన శక్తినంతా ఉపయోగింనా ఆ బాలుడి పట్టు నుంచి విడిపించుకులేకపోయింది. ఇలా దాదాపు రెండు గంటల పాటు ఆ పందితో పోరాడాడు సమన్.. అయితే అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు నీటిలో పందిని పట్టుకున్న ఉన్న సుమన్ గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అటవీశాఖ అధికారుల సహాయంతో అడవి పందిని బంధించారు.
అనంతరం పందిలో జరిగిన పోరాటంలో గాయపడిన సుమన్‌ను హాస్పిటల్‌కు తరలించి వైద్యం అందించారు. అయితే తన ప్రాణాలను కాపాడుకునేందుకే తన బలాన్నంతా ఉపయోగించిన ఆ అడవి పందితో పోరాడినట్టు సుమన్ తెలిపాడు. అయితే బాలుడు పందితో నీటిలో పోరాడుతున్న దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించిన స్థానికులు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి.
అడవి పందితో రెండు గంటలు పోరాడిన బాలుడు
ఒడిశాలోని కటక్ (బంకీ) సమీపంలో ఒక వింతైన, సాహసోపేత ఘటన
కెనాల్లో స్నానం చేస్తున్న 14 ఏళ్ల బాలుడిపై అకస్మాత్తుగా అడవి పంది దాడి
భయపడకుండా దాదాపు 2 గంటల పాటు అడవి పందితో పోరాడిన బాలుడు
చివరికి స్థానికులు వచ్చి ఆ అడవి పంది నుంచి బాలుడిని… pic.twitter.com/aZd9DTmTza
— Telugu Feed (@Telugufeedsite) August 26, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.