తోటలో పనిచేస్తుండగా.. ప్రత్యక్షమైన కింగ్ కోబ్రా.. ఆ తర్వాత..

| Edited By:

Jul 07, 2019 | 9:29 PM

కింగ్ కోబ్రా.. పేరు వింటేనే చాలు… గుండెల్లో గుబులు పుట్టడం ఖాయం. సాధారణంగా దట్టమైన అటవీ ప్రాంతంలోనే ఇవి ఉంటాయి. ఇవి కాటేస్తే.. సెకన్ల వ్యవధిలో ప్రాణాలు కోల్పోవడం ఖాయం. అయితే అలాంటి పాము ఒకటి అసోంలో ప్రత్యక్షమైంది. దీంతో ఆ పామును చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పాము అలాంటి ఇలాంటి పాము కాదు.. ఎకంగా 14 అడుగులు ఉంది. ఈ ఘటన అసోం నాగోన్ జిల్లా జియాజూరి టీ ఎస్టేట్ ప్రాంతంలో జరిగింది. […]

తోటలో పనిచేస్తుండగా.. ప్రత్యక్షమైన కింగ్ కోబ్రా.. ఆ తర్వాత..
Follow us on

కింగ్ కోబ్రా.. పేరు వింటేనే చాలు… గుండెల్లో గుబులు పుట్టడం ఖాయం. సాధారణంగా దట్టమైన అటవీ ప్రాంతంలోనే ఇవి ఉంటాయి. ఇవి కాటేస్తే.. సెకన్ల వ్యవధిలో ప్రాణాలు కోల్పోవడం ఖాయం. అయితే అలాంటి పాము ఒకటి అసోంలో ప్రత్యక్షమైంది. దీంతో ఆ పామును చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పాము అలాంటి ఇలాంటి పాము కాదు.. ఎకంగా 14 అడుగులు ఉంది.

ఈ ఘటన అసోం నాగోన్ జిల్లా జియాజూరి టీ ఎస్టేట్ ప్రాంతంలో జరిగింది. ఆ పట్టణంలోని ఓ తేయాకు తోటలో ఈ పాము ప్రత్యక్షమైంది. దీంతో అక్కడ పనిచేస్తున్న కూలీలు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీసి.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన స్నేక్ రెస్క్యూ టీం.. ఆ పామును చాకచక్యంగా పట్టుకున్నారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పట్టుకున్న పామును దగ్గర్లోని సువాంగ్ రిజర్వ్ ఫారెస్ట్‌లో విడిచిపెట్టారు.