రాహుల్ కి సపోర్ట్.. ముంబై కాంగ్రెస్ చీఫ్ రాజీనామా
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మద్దతుగా ముంబై కాంగ్రెస్ చీఫ్ మిలింద్ దేవర ఆదివారం రాజీనామా చేశారు. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తాజాగా పదవులకు రాజీనామా చేసిన వారిలో ఈయన ఒకరయ్యారు. ఈ ఎన్నికలకు ముందే ముంబై పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవిని మిలింద్ చేపట్టారు. రాహుల్ తో భేటీ అయిన అనంతరం పదవిని వీడాలని తాను నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. ముంబై […]
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మద్దతుగా ముంబై కాంగ్రెస్ చీఫ్ మిలింద్ దేవర ఆదివారం రాజీనామా చేశారు. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తాజాగా పదవులకు రాజీనామా చేసిన వారిలో ఈయన ఒకరయ్యారు. ఈ ఎన్నికలకు ముందే ముంబై పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవిని మిలింద్ చేపట్టారు. రాహుల్ తో భేటీ అయిన అనంతరం పదవిని వీడాలని తాను నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. ముంబై పార్టీ యూనిట్ కార్యకలాపాల పర్యవేక్షణకు ముగ్గురు సభ్యులతో పానెల్ ఏర్పాటు చేయాలని సూచించానని, పార్టీ బలోపేతానికి తన వంతుగా జాతీయ స్థాయిలో కృషి చేస్తూనే ఉంటానని మిలింద్ దేవర పేర్కొన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ సంవత్సరాంతంలో జరగనున్నాయి. అప్పటివరకు ముగ్గురు సభ్యుల ఈ కమిటీ పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గత మే 25 నే అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.