Fire Accident in COVID-19 hospital: మహారాష్ట్రలోని ఆసుపత్రుల్లో వరుస ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రెండురోజుల క్రితం ఆసుపత్రిలో ఆక్సిజన్ లీక్ కావడంతో దాదాపు 20 మందికి పైగా మరణించారు. ఈసంఘటన మరిచిపోకముందే.. మరో కోవిడ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో 13 మంది కరోనా బాధితులు సజీవదహనమయ్యారు. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశముంది. చాలామంది గాయాలపాలయ్యారు ఈ సంఘటన పాల్ఘర్ జిల్లా వసాయ్ వీరార్ పరిధిలోని విజయ్ వల్లభ కోవిడ్ కేర్ ఆసుపత్రిలో సంభవించింది.
Maharashtra | 13 people have died in a fire that broke out at Vijay Vallabh COVID care hospital in Virar, early morning today pic.twitter.com/DoySNt4CSQ
— ANI (@ANI) April 23, 2021
షార్ట్ సర్క్యూట్‌తో ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులో మంటలు చెలరేగాయి. దీంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న 13 మంది రోగులు మరణించారు. ఇంకా చాలామంది బాధితులను ఇతర ఆసుపత్రులకు తరలించారు. అధికారులు, పోలీసులు చేరుకొని రెస్క్యూ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#UPDATE 13 people have died so far in fire at COVID hospital in Virar, in Vasai Virar municipal limits, Palghar district
(Earlier visuals)#Maharashtra pic.twitter.com/KHTiSqbLMY
— ANI (@ANI) April 23, 2021
Also Read: