AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medical Oxygen: ప్రాణ వాయువు కోసం పరితపిస్తున్న కరోనా బాధితులు.. ఆక్సిజన్ కోసం విశాఖ కేజీహెచ్ అధికారులు వినూత్న ప్రయోగం

ఉత్తరాంధ్ర ఆరోగ్య సంజీవిని విశాఖ లోని కింగ్ జార్జ్ హాస్పిటల్ ఆక్సిజన్ విజయంలో స్వయం సమృద్ది దిశగా అడుగులు వేస్తోంది. కోవిడ్ పేషంట్స్ కోసం ఆక్సిజన్ తయారీకి సిద్దమవుతోంది.

Medical Oxygen: ప్రాణ వాయువు కోసం పరితపిస్తున్న కరోనా బాధితులు.. ఆక్సిజన్ కోసం విశాఖ కేజీహెచ్ అధికారులు వినూత్న ప్రయోగం
KGH Hospital
Balaraju Goud
|

Updated on: Apr 23, 2021 | 7:02 AM

Share

medical oxygen availability: ఉత్తరాంధ్ర ఆరోగ్య సంజీవిని విశాఖ లోని కింగ్ జార్జ్ హాస్పిటల్ ఆక్సిజన్ విజయంలో స్వయం సమృద్ది దిశగా అడుగులు వేస్తోంది. కోవిడ్ పేషంట్స్ కోసం ఆక్సిజన్ తయారీకి సిద్దమవుతోంది. విశాఖ కేజీహెచ్ లోని సిఎస్ఆర్ బ్లాక్ లోని కోవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న బాధితుల కోసం నెలకు లక్ష లీటర్ల ఆక్సిజన్ వినియోగిస్తున్న నేపథ్యంలో సొంతంగా తయారీకి నడుం బిగిస్తోంది.

గత ఏడాది సెప్టెంబరులో ఆక్సిజన్ ట్యాంకర్ను విశాఖ కేజీహెచ్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 20వేల లీటర్ల సామర్థ్యంతో ఇది సేవలందిస్తోంది. వార్డులోని 500 పడకలకు ఆక్సిజన్ సదుపాయం ఉంది. 300 పడకలకు వెంటిలేట ర్లను బిగించారు. హైనేసల్ మరో అయిదు ఇక్కడ ఉన్నాయి. కొవిడ్ బాధితులకు కిడ్నీల సమస్య ఎదురైతే ఇక్కడ చికిత్స అందిస్తారు. రోజుకు 3,500 లీటర్ల ఆక్సిజన్ వినియోగిస్తారు. కేంద్రీకృత ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాతే ఈ వార్డును వినియోగంలోకి తెచ్చారు.

అయితే, వినియోగంలోకి వచ్చిన తర్వాత కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆక్సిజన్ వినియోగం కూడా అమాంతం పడిపోయింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రోజుకు పదుల లీటర్లలోనే ఆక్సిజన్ వినియోగించారు. కొన్ని రోజులు అసలు విని. యోగమే లేదు. గత నెల నుంచి కావిడ్ కేసుల తాకిడి ప్రారంభమైంది. ప్రస్తుతం 430 మంది వరకు బాధితులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. దీంతో ఆక్సిజన్ వినియోగం అమాంతం పెరిగింది. సగటున రోజుకు 3,300 లీటర్ల నుంచి 3,500 లీటర్ల వరకు వినియోగం అవుతోంది. భవిష్యత్తులో మరింత పెరిగినా ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదని ఆంధ్ర వైద్యకళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.వి.సుధాకర్ తెలిపారు. ఈ లెక్కన నెలకు లక్ష లీటర్ల వరకు వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఆక్సిజన్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర వడం లేదని, నిర్వహణకు నిరంతరం సిబ్బంది. అందుబాటులో ఉన్నారన్నారు..

ఒకవేళ ట్యాంకరు ద్వారా ఆక్సిజన్ సరఫరాలో అవాంతరాలు ఎదురైతే ప్రత్యామ్నాయాలు సిద్ధం చేశామని డాక్టర్ సుధాకర్ తెలిపారు. 38 లీటర్ల సామర్థ్యం 267 సిలిండర్లను కావిడ్ వార్డు సెల్లార్లో అందుబాటులో ఉంచామన్నారు. కేంద్రీకృత విధానంలో ఇబ్బందులు వస్తే వీటి ద్వారా మూడు రోజులపాటు పడకలకు ఆక్సిజన్ సరఫరా చేయవచ్చన్నారు. అంతేకాదు, ఈ నెలాఖరుకి గంటకి వెయ్యి లీటర్ల ఆక్షిజన్ తయారు అయ్యేలా ఫ్లాంటును రూపొందిస్తున్నట్లు చెప్పారు.

Read Also..  Corona Vaccine: ఏపీలో నిత్యం పదివేలు దాటుతున్న కరోనా కేసులు… ఈ నెల 26, 27 తేదీల్లో ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలకు రెండో విడత టీకా