Bike Racer: 13 ఏళ్ల వయసులోనే రేసింగ్‌లో ఎన్నో టైటిల్స్ సాధించాడు.. చివరికి ఊహించని ప్రమాదం

| Edited By: Janardhan Veluru

Aug 09, 2023 | 6:41 PM

స్పెయిన్, ఫ్రాన్స్, క్వీన్స్లాండ్ లో జరిగిన రేసుల్లో అనేక జాతీయ, అంతర్జాతీయ రేసుల్లో గెలుపొందాడు శ్రేయాస్. కానీ సొంత దేశంలో జరిగిన రేసింగ్‎లో ఊహించని ప్రమాదం జరిగింది. రెండు రోజుల క్రితం చెన్నై శివారు శ్రీపెరంబదూరు వద్దనున్న ఎం.ఆర్.ఎఫ్ ట్రాక్‎పై రేసింగ్ జరిగింది. ఈ ఇండియన్ నేషనల్ రేసింగ్ లో దాదాపు 18 మంది రేసర్లు పాల్గొన్నారు.

Bike Racer: 13 ఏళ్ల వయసులోనే రేసింగ్‌లో ఎన్నో టైటిల్స్ సాధించాడు.. చివరికి ఊహించని ప్రమాదం
Shreyas Hareesh
Follow us on

వయస్సు పదమూడేల్లే.. కానీ రికార్డుల్లో మాత్రం ఘనుడు ఆ బాలుడు. కర్ణాటకకు చెందిన శ్రేయాస్ అనే పదమూడేళ్ళ బాలుడు చిన్న వయస్సు నుంచే రేసింగ్ లో ప్రావీణ్యం పొందాడు. బెంగళూరులోని కెన్స్త్రీ స్కూల్‎లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. ఇటీవల జరిగిన మిసిజిపి ఇండియా టైటిల్ సొంతం చేసుకున్నాడు. స్పెయిన్, ఫ్రాన్స్, క్వీన్స్లాండ్ లో జరిగిన రేసుల్లో అనేక జాతీయ, అంతర్జాతీయ రేసుల్లో గెలుపొందాడు శ్రేయాస్. కానీ సొంత దేశంలో జరిగిన రేసింగ్‎లో ఊహించని ప్రమాదం జరిగింది. రెండు రోజుల క్రితం చెన్నై శివారు శ్రీపెరంబదూరు వద్దనున్న ఎం.ఆర్.ఎఫ్ ట్రాక్‎పై రేసింగ్ జరిగింది. ఈ ఇండియన్ నేషనల్ రేసింగ్ లో దాదాపు 18 మంది రేసర్లు పాల్గొన్నారు. గతంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక రికార్డులు సొంతం చేసుకున్న శ్రేయాస్ ఇక్కడ మరో గెలుపు ధీమాతో రేసేంగ్ ట్రాక్ పైకి వెళ్ళాడు.

తల్లిదండ్రులకు ఈ రేసింగ్ లో ఛాంపియన్ గా గెలుస్తానని చెప్పి మరి వెళ్లినట్లు చెబుతున్నారు కుటుంబ సభ్యులు. కానీ అనుకోని ప్రమాదం తల్లిదండ్రుల కన్నీరు మిగిల్చింది. బైక్ రేసింగ్ పోటీల్లో తీవ్ర విషాదం నెలకొంది. ట్రాక్ పై ఒక్కసారిగా బైక్ అదుపుటప్పడంతో 13 ఏళ్ల బైక్ రేసర్ శ్రేయాస్ తీవ్ర గాయాలు పాలయ్యాడు. బైక్ కిందపడగానే హెల్మెట్ జారిపోయింది. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు . అతి చిన్న వయసులోనే శ్రేయాస్ పేరిట పలు రికార్డులు కూడా ఉన్నాయి. గతంలో స్పెయిన్ దేశంలో జరిగిన బైక్ రేస్ లో పాల్గొని ఫైనల్ కి చేరుకున్న తొలి ఇండియన్ బైక్ రేసర్ శ్రేయాస్. శ్రేయాస్ 2022 లో తర్‎లో ఎఫ్‎ఐ‎ఎం‎లో మినీ ట్రిప్ లో తన కెరియర్‎ని ప్రారంభించి కప్ సొంతం చేసుకుని ఆపై జాతీయ ఛాంపియన్ షిప్ లో పాల్గొన్న శ్రేయాస్ ని టీవీఎస్ కంపెనీ రూకి కప్ కి ఎంచుకుంది.

ఇవి కూడా చదవండి

యువ రేసర్ ని ప్రోత్సహించిన టీవీఎస్ అతనికి శిక్షణ ఇప్పించడంతో పాటు టీవీస్ రేసర్ బైక్ ను కూడా ఇచ్చింది . రూకి కేటగిరి లో తొలి నాలుగు రేసులో శ్రేయాస్ విజేతగా నిలబడ్డాడు. దేశంలో సామర్ధ్యం కలిగిన రేసర్లలో ఒకడిగా నిపుణులు శ్రేయాస్ ని గుర్తించారు. తాజా ప్రమాదంలో పదమూడేళ్ల శ్రేయాస్ దుర్మరణం చెందగా 2022 జనవరిలో ప్రముఖ రేసర్ ఇలాంటి ప్రమాదంలో మృతి చెందారు. చెన్నైలో జరిగిన ఇండియన్ నేషనల్ రేసింగ్ లో ప్రముఖ రేసర్ కె.ఈ కుమార్ మృతిచెందారు.. ఇప్పుడు శ్రేయాస్ మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఒక మంచి రేసర్‌ను కోల్పోయామంటూ అక్కడి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.