కరోనా వేళ.. పిడుగు పాటుకు పన్నెండు మంది బలి

| Edited By:

May 06, 2020 | 6:27 PM

ఓ వైపు ప్రపంచమంతా కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తుండగా.. పలు దేశాలు మాత్రం ప్రకృతి వైపరిత్యాలతో కూడా భయబ్రాంతులకు గురవుతున్నాయి. తాజాగా కొన్ని దేశాల్లో భూకంపాలు సంభవించిన సంగతి తెలిసిందే. పలుచోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇక మనదేశంలో కూడా అటు కరోనా ప్రభావంతో జరిగే మరణాలకు తోడుగా.. ప్రకృతి ప్రకోపానికి బలైకూడా ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా బీహార్‌లో పలు చోట్ల పిడుగులు పడి పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు. పాట్నా జిల్లాలో ముగ్గురు, జెహానాబాద్, […]

కరోనా వేళ.. పిడుగు పాటుకు పన్నెండు మంది బలి
Follow us on

ఓ వైపు ప్రపంచమంతా కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తుండగా.. పలు దేశాలు మాత్రం ప్రకృతి వైపరిత్యాలతో కూడా భయబ్రాంతులకు గురవుతున్నాయి. తాజాగా కొన్ని దేశాల్లో భూకంపాలు సంభవించిన సంగతి తెలిసిందే. పలుచోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇక మనదేశంలో కూడా అటు కరోనా ప్రభావంతో జరిగే మరణాలకు తోడుగా.. ప్రకృతి ప్రకోపానికి బలైకూడా ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా బీహార్‌లో పలు చోట్ల పిడుగులు పడి పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు. పాట్నా జిల్లాలో ముగ్గురు, జెహానాబాద్, కతిహార్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. ఇక నలంద, గయ, జాముయి, అర్వాల్‌ జిల్లాల్లో ఒక్కక్కరు మృతిచెందారు. కాగా ఈ ఘటనపై సీఎం నితీష్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఇప్పటికే కరోనాతో వణికిపోతున్న ప్రజలు.. ఇటు భారీ వర్షాలతో పాటు పిడుగులు పడుతుండటంతో మరింత భయబ్రాంతులకు గురవుతున్నారు.