Bus accident: జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ మినీ బస్సు.. 11మంది దుర్మరణం..

ఇప్పటి వరకు ఆరుగురు మరణించారని పలువురు గాయపడ్డారని నిర్ధారించారు. పూంచ్ జిల్లాలోని సావ్జియాన్ అనే గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది.

Bus accident: జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ మినీ బస్సు.. 11మంది దుర్మరణం..
Minibus Falls

Updated on: Sep 14, 2022 | 10:47 AM

Bus accident: జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లోని సావ్జియాన్ ప్రాంతంలో మినీ-బస్సు ప్రమాదం జరిగింది. పూంచ్ జిల్లాలో ప్రమాదవశాత్తు మినీ బస్సు లోయలో పడిపోవడంతో 11 మంది మృతి చెందారు.  పలువురు తీవ్రంగా గాయపడ్డారని నిర్ధారించారు. పూంచ్ జిల్లాలోని సావ్జియాన్ అనే గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. సంఘటన స్థలంలో ఆర్మీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని మండిలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది.  సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి