PM Modi: ప్రధాని మోదీకి పాతిక ఎకరాలు రాసిస్తానన్న బామ్మ.. ఎందుకో తెలుసా?

ప్రధాని మోదీకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సెలబ్రిటీలు, క్రికెటర్లు.. వివిధ దేశాధినేతలు కూడా నరేంద్ర మోదీకి అభిమానులే..

PM Modi: ప్రధాని మోదీకి పాతిక ఎకరాలు రాసిస్తానన్న బామ్మ.. ఎందుకో తెలుసా?
Viral

Updated on: Jun 27, 2023 | 6:58 PM

ప్రధాని మోదీకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సెలబ్రిటీలు, క్రికెటర్లు.. వివిధ దేశాధినేతలు కూడా నరేంద్ర మోదీకి అభిమానులే. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఆయన ప్రజలకు ఎంతో చేరువయ్యారు. ప్రజలు మోదీపై తమకున్న ప్రేమను రకరకాలుగా చాటుకుంటున్నారు. తాజాగా ఓ పెద్దావిడ మోదీపై తనకున్న ప్రేమను దేశానికి చాటిచెప్పింది. నరేంద్ర మోదీ తన కొడుకు లాంటివాడని.. తన పేరున ఉన్న 25 ఎకరాల భూమిని మోదీకి రాసిస్తానని చెబుతోంది. వందేళ్ల బామ్మ మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లా హరిపుర గ్రామానికి చెందిన ఈ బామ్మ పేరు మంగీబాయి తన్వర్. ఆమెకు 14 మంది సంతానం. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 100 ఏళ్ల ఈ బామ్మ.. ప్రధానిపై ప్రశంసలు కురిపించింది. మోదీ తనకు కొడుకు లాంటివారని.. దేశానికి ఎంతో సేవ చేసిన ఆయన.. తనకూ, తనలాంటి వృద్దులకు ఎన్నో పధకాల ద్వారా అండగా ఉన్నారని చెప్పుకొచ్చింది. ప్రధాని మోదీ తనకు 15వ కుమారుడు లాంటివారని చెబుతోంది. ఇంతలా తమకు సాయం చేస్తోన్న మోదీకి తనకున్న 25 ఎకరాల ఆస్తిని రాసి ఇస్తానని చెప్పింది. ప్రధాని ఫొటో చూసిన మంగీబాయి ఇతడే మోదీఅని, ఆయనను టీవీల్లో చూశానని చెప్పారు. మోదీ తనకు ఇల్లు ఇవ్వడమే కాకుండా ఉచితంగా వైద్యం అందజేస్తున్నారని తెలిపింది. వితంతు పెన్షన్ ఇచ్చి ఆర్థికంగా అండగా నిలబడ్డారు. తినడానికి ఆహారం అందిస్తున్నారు. ప్రధాని మోదీ వల్లే తీర్థయాత్రలకు వెళ్లగలిగానని, అందుకే మోదీని తన కుమారుడుగా భావిస్తున్నానని చెప్పింది. అవకాశం ఉంటే ప్రధానిని స్వయంగా కలవాలని ఉందన్నారు మంగీబాయి. కాగా, ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.