జమ్ముకశ్మీర్‌ను ముంచెత్తిన ఆకస్మిక వరదలు.. 10 మంది మృతి , పలువురికి గాయాలు

జమ్ముకశ్మీర్‌ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. కిష్టావర్‌, రాజోరి ప్రాంతాల్లో మెరుపు వరదలతో అపారనష్టం జరిగింది. భక్తుల టెంట్లు కొట్టుకుపోవడంతో 10 మంది చనిపోయారు. పలువురికి గాయాలయ్యాయి. వరదల కారణంగా చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. రాజోరిలో వాగులు, వంకలు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. అధికారులు వెంటనే భారీ సహాయక చర్యలు చేపట్టారు.

జమ్ముకశ్మీర్‌ను ముంచెత్తిన ఆకస్మిక వరదలు.. 10 మంది మృతి , పలువురికి గాయాలు
Massive Cloudburst In Jammu Kashmr's Chositi

Updated on: Aug 14, 2025 | 2:47 PM

జమ్ముకశ్మీర్‌ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. కిష్టావర్‌, రాజోరి ప్రాంతాల్లో మెరుపు వరదలతో అపారనష్టం జరిగింది. భక్తుల టెంట్లు కొట్టుకుపోవడంతో 10 మంది చనిపోయారు. పలువురికి గాయాలయ్యాయి. వరదల కారణంగా చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. రాజోరిలో వాగులు, వంకలు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి . అధికారులు వెంటనే భారీ సహాయక చర్యలు చేపట్టారు. గత మూడు రోజుల నుంచి కశ్మీర్‌ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మచెల్‌ మాత ఆలయానికి వెళ్లే దారిలో భారీగా కొండచరియలు విరిగపడ్డాయి. భారీ సంఖ్యలో ఆ సమయంలో భక్తులు ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో పాటు పోలీసులు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

జమ్మూ కాశ్మీర్‌లోని చసోటి ప్రాంతంలో గురువారం(ఆగస్టు 14) మధ్యాహ్నం భారీ క్లౌడ్‌బస్టర్ కారణంగా వరదలు సంభవించి కనీసం 10 మంది మరణించి ఉండవచ్చని అధికారులు తెలిపారు. రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. వరదల్లో చిక్కుకున్న యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కిష్త్వార్‌లోని హిమాలయ పుణ్యక్షేత్రం మాతా చండికి మచైల్ మాతా యాత్రకు చసోటి ప్రారంభ స్థానం. కిష్త్వార్‌లోని చసోటి ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించినట్లు డిప్యూటీ కమిషనర్ కిష్త్వార్ పంకజ్ శర్మ తెలిపారు. బాధితులకు సాధ్యమైన అన్ని సహాయం అందించాలని పౌర, పోలీసు, సైన్యం, NDRF మరియు SDRF అధికారులను ఆదేశించారు.

అటు హిమాచల్‌ప్రదేశ్‌లో వరదల బీభత్సం కొనసాగుతోంది. కొండ ప్రాంతంలో క్లౌడ్‌బరస్ట్‌ కారణంగా కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షాలతో అనేక వంతెనలు కొట్టుకుపోయాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. సిమ్లా, లాహౌల్‌, స్పితి జిల్లాల్లో చాలా వంతెనలు కొట్టుకుపోయాయి. భారీ వరదలతో హిమాచల్‌లో 300 రోడ్లను మూసేశారు. గన్వి రావైన్‌లో వరదలకు ఓ పోలీసు పోస్ట్‌ కూడా కొట్టుకుపోయింది. అయితే వరదల కారణంగా లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సిమ్లా సమీపంలో కొండచరియలు విరిగిపడడంతో కార్లు ధ్వంసమయ్యాయి.

కార్పట్ గ్రామానికి ప్రమాదం పొంచి ఉందని అధికారులు అలర్ట్‌ చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రెండు జాతీయ రహదారులు సహా మొత్తం 325 రోడ్లను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. స్టేట్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ ప్రకారం.. మండి జిల్లాలో 179, కులు జిల్లాలో 71 రోడ్లు ఉన్నాయి. జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు రూ.2,031 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..