ఆసుపత్రుల్లో పని చేసే స్టాఫ్ లో వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ప్రతి ఏడుగురిలో ఒకరికి కోవిడ్ 19 ఎందుకు సోకుతుంది ? ఈ విధమైన కేసులను ‘బ్రేక్ త్రూ కేసులని’ అంటారట.. అంటే వ్యాక్సిన్ కల్పించిన రక్షణ వ్యవస్థ నుంచి ఇన్ఫెక్షన్ (వైరస్) చొచ్ఛుకు పోతుందని నిపుణులు అంటున్నారు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో హెల్త్ కేర్ వర్కర్లపై నిర్వహించిన చిన్న అద్ధ్యయనం చూస్తే వీరిలో 13.3 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఆసుపత్రి పాలయ్యారట. ఫోర్టిస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డయాబెటిస్, మెటబాలిక్ డిసీజెస్ ఎండోక్రైనాలజీ విభాగాలు వీరిపై స్టడీ నిర్వహించాయి. దాదాపు 113 మందిమీద అధ్యయనాన్ని నిర్వహించినట్టు ఈ విభాగాల అధిపతులు తెలిపారు. జనవరి 16 నుంచి ఇప్పటివరకు ఈ స్టడీ చేశామని, చాలామందిలో మెటబాలిక్ డిజాస్టర్స్ వల్లే వివిధ రకాల రుగ్మతలు కలిగాయని వారు చెప్పారు. అయితే ఒకరిద్దరిలో ఇవి తీవ్రంగా ఉన్నట్టు కనుగొన్నామన్నారు.. డయాబెటిస్ తో బాటు ఇతర కారణాలు కూడా ఉంటాయని, స్టెరాయిడ్స్ సైతం ఇందుకు దోహదపడి ఉండవచ్చునని వారు అభిప్రాయపడ్డారు.వీరిలో 28 మందికి కోవాగ్జిన్, 85 మందికి కోవిషీల్డ్ టీకామందు ఇచ్చినట్టు వెల్లడైంది.
ఇక ఇండియాలో ఈ రెండు రకాల వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ స్టాఫ్ లో కోవిడ్ లక్షణాలు కనబడడం చాలా తక్కువని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.ఈ కేసులు అత్యంత స్వల్పమని పేర్కొంది. శరీరతత్వాలను బట్టి కోవిడ్ లక్షణాలు ఆధార పడిఉంటాయని వివరించింది. కాగా-ఇతర బ్లడ్ గ్రూపులతో పోలిస్తే..ఏబీ, బీ బ్లడ్ గ్రూపులవారు కోవిద్ కి గురయ్యే అవకాశాలు ఎక్కువని సీఎస్ఐఆర్ సంస్థ పేర్కొంది. దీనిపై ఇంకా స్టడీ నిర్వహిస్తున్నట్టు తెలిపింది.
మరిన్ని చదవండి ఇక్కడ :నిప్పులను మిఠాయిల్లా మింగేస్తోన్న మహిళ..!ఫైర్ గేమ్స్ వద్దు మేడం. వైరల్ అవుతున్న వీడియో
Viral Video :ఏలియన్స్ నన్ను కిడ్నప్ చేసాయి..!అంటూ లేడి షేర్ చేసిన వీడియో వైరల్..