
పాట్నా, మార్చి 22: బీహార్‌లోని సుపాల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న నాలుగులైన్ల వంతెన శుక్రవారం (మార్చి 22) ఒక్కసారిగా పేకమేడలా కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. సుపాల్ జిల్లాలోని మరీచా సమీపంలో భేజాచ బకౌర్ మధ్య కోసీ నదిపై భారీ వంతెనను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాణంలో ఉన్న ఈ వంతెన శుక్రవారం ఉదయం 7 గంటలకు బ్రిడ్జిలోని కొంత భాగం కూలిపోయింది. అప్పటికే నిర్మాణ పనులు జరుగుతుండటంతో శిథిలాల కింద పడి 30 మందికిపైగా కార్మికులు చిక్కుకుపోయారు. కార్మికుల ఆహాకారాలతో ఆ ప్రాంతం అంతా భయంకంగా మారింది.
సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు గాయాలపాలైన తొమ్మిది మంది రక్షించి ఆస్పత్రికి తరలించినట్లు సుపాల్ డీఎం కౌశల్ కుమార్ తెలిపారు. ఈ ఘనపై పోలీసులు కేసు నమోదుచేసిన దర్యాప్తు ప్రారంభించారు.
#UPDATE | Supaul, Bihar: One died and nine injured as a portion of an under-construction bridge collapsed near Maricha between Bheja-Bakaur: Supaul DM Kaushal Kumar https://t.co/DhsS9ZCCws
— ANI (@ANI) March 22, 2024
కాగా కోసీ నదిపై రూ.1700 కోట్లకుపైగా వ్యయంతో వంతెనను నిర్మిస్తున్నారు. భగల్‌పూర్, ఖగారియా జిల్లాలను కలిపేలా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. 2014లో దీని నిర్మాణానికి బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శంకుస్థాపన చేశారు. 2019 నాటికి నిర్మాణ పనులు పూర్తి కావల్సి ఉంది. కానీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదం బీహార్‌లోని భాగల్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడాన్ని పోలి ఉందని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో తాజా ఘటన రాష్ట్ర అధికార ప్రభుత్వం, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల వాగ్వాదానికి దారితీసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.