సీఎం జగన్‌పై లోకేష్ సెన్సేషనల్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా షాకింగ్ కామెంట్స్ చేశారు. గురువారం నాడు ప్రాజెక్ట్ విషయాలపై అసెంబ్లీలో చర్చ జరిగిన విషయం విదితమే. ఈ సభలో అసెంబ్లీలో నుంచి మరో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది. కాగా ఈ మొత్తం వ్యవహారంపై నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘నోటుకి ….నీళ్లు!.. హిట్లర్ కాస్తా ఒక్కసారిగా భగీరథునిగా మారిపోయాడు. ఒకప్పుడు జగన్ గారి జలదీక్షలో ఆంధ్రా […]
![సీఎం జగన్‌పై లోకేష్ సెన్సేషనల్ కామెంట్స్](https://images.tv9telugu.com/wp-content/uploads/2019/07/Amaravati.png?w=1280)
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా షాకింగ్ కామెంట్స్ చేశారు. గురువారం నాడు ప్రాజెక్ట్ విషయాలపై అసెంబ్లీలో చర్చ జరిగిన విషయం విదితమే. ఈ సభలో అసెంబ్లీలో నుంచి మరో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది. కాగా ఈ మొత్తం వ్యవహారంపై నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
‘నోటుకి ….నీళ్లు!.. హిట్లర్ కాస్తా ఒక్కసారిగా భగీరథునిగా మారిపోయాడు. ఒకప్పుడు జగన్ గారి జలదీక్షలో ఆంధ్రా నీళ్లు దోచేసిన కేసీఆర్ కాస్తా @ysjagan గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి ఆంధ్రాకి నీళ్లు దానం చేసే మనసున్న మారాజుగా మారారు’ అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు.
‘యూ టర్న్ జగన్ గారూ! ఈ ఊసరవెల్లి వేషాలు మాని, ఎన్నికల్లో గెలుపు కోసం కట్టల సాయం అందుకున్నాం… అందుకే రిటర్న్ గిఫ్ట్ గా గోదావరి నీటిపై ఆంధ్రా హక్కులు వదులుకుంటున్నాం అని చెప్పండి’ అని నారా లోకేష్ ట్విట్టర్ వేదిగా రాసుకొచ్చారు. కాగా ఈ ట్వీట్‌పై టీడీపీ, వైసీపీ నేతలు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు.
యూ టర్న్ జగన్ గారూ! ఈ ఊసరవెల్లి వేషాలు మాని, ఎన్నికల్లో గెలుపు కోసం కట్టల సాయం అందుకున్నాం… అందుకే రిటర్న్ గిఫ్ట్ గా గోదావరి నీటిపై ఆంధ్రా హక్కులు వదులుకుంటున్నాం అని చెప్పండి.
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) July 25, 2019