New Trends:మ్యారేజ్‎లో కొత్త ట్రెండ్.. ఈ కలెక్షన్స్ వైపు మొగ్గు చూపుతున్న యువత..

| Edited By: Srikar T

Apr 06, 2024 | 5:52 PM

పెళ్లి అనగానే అందరిలో తామే సమ్ థింగ్ స్పెషల్‎గా చేసుకోవాలని అనుకుంటారు. అందుకే ఖర్చు ఎంత అయినా పర్వాలేదు యూనిక్‎గా ఉండే దాన్నే ఇష్ట పడుతున్నారు. ముఖ్యంగా మ్యారేజ్‎లో మొదటి ఫంక్షన్ ఎంగేజిమెంట్. మరి ఆ ఎంగేజిమెంట్ అనగానే టక్కున గుర్తుకు వచ్చేది రింగ్స్.

New Trends:మ్యారేజ్‎లో కొత్త ట్రెండ్.. ఈ కలెక్షన్స్ వైపు మొగ్గు చూపుతున్న యువత..
New Marriage Trend
Follow us on

పెళ్లి అనగానే అందరిలో తామే సమ్ థింగ్ స్పెషల్‎గా చేసుకోవాలని అనుకుంటారు. అందుకే ఖర్చు ఎంత అయినా పర్వాలేదు యూనిక్‎గా ఉండే దాన్నే ఇష్ట పడుతున్నారు. ముఖ్యంగా మ్యారేజ్‎లో మొదటి ఫంక్షన్ ఎంగేజిమెంట్. మరి ఆ ఎంగేజిమెంట్ అనగానే టక్కున గుర్తుకు వచ్చేది రింగ్స్. అసలే వెడ్డింగ్ సీజన్.. ఇక రింగ్స్ దగ్గర నుండి వివిధ రకాల జ్యువెలరీ వరకు ఏమి తీసుకోవాలో ప్రతిదీ అభిరుచికి తగట్టుగా ప్లాన్ చేసుకుంటూ కొనుగోలు చేసుకుంటారు. ఇక మార్కెట్‎లో వెరైటీ ఆఫ్ రింగ్స్ వచ్చాయి.

ప్రతి ఒక్కరికి వివాహం అనేది లైఫ్‎లో ఒక మంచి మెమొరబుల్ మూమెంట్. అందులో ఎంగేజిమెంట్ ఆరంభం. ఒక్కపుడు తాంబులాలు ఇచ్చి పుచ్చుకుంటే చాలు అనుకునే వారు. కానీ ఇప్పటి జనరేషన్ వాళ్లు అందరిలో స్పెషల్‎గా ఉండాలని అనుకుంటారు. వీళ్లకి అనుకూలంగా ఎంగేజిమెంట్ స్పెషల్ రింగ్స్ జ్యువలరీ షాప్స్‎లో సందడి చేస్తున్నాయి. మొన్నటి వరకు గోల్డ్‎పైన ఇంట్రెస్ చూపించిన సిటిజన్స్.. ఇప్పుడు ధర ఎక్కువ అయినా పర్వాలేదు లైఫ్‎లో ఒక్కసారి జరిగే వేడుకలో తమ జీవిత భాగ్యస్వామికి ఇచ్చే గిఫ్ట్ ఎప్పటికి గుర్తు ఉండాలని డైమండ్ అండ్ ప్లాటినం రింగ్స్ ఎక్స్చేంజి చేసుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‎లో కొత్త మోడల్స్ రావడంతో డిఫరెంట్ రింగ్స్‎ను సెలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అమ్మాయిలతో పాటు అబ్బయిలకు కూడా మంచి కలెక్షన్ వస్తున్నాయి. కపుల్ రింగ్స్ చాలా బాగున్నాయి అంటున్నారు పబ్లిక్.

ఎక్కువగా కార్పోరేట్ ఉద్యోగాలు చేసే వారు కపుల్ అండ్ బ్యాండ్ రింగ్స్‎ను ఎంచుకుంటున్నారు. చాలా మంది 15 రోజుల నుండే కస్టమైజ్ చేస్తున్నారని అంటున్నారు సేల్స్ పర్సన్. వీటితో పాటు స్పెషల్‎గా సప్రైజ్ కోసం కొని స్పెషల్ రింగ్స్ అండ్ బ్రేస్లెట్స్‎ను కూడా ప్రీ ఆర్డర్ చేపిస్తున్నామని అంటున్నారు. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కావడంతో మంచి డిజైన్స్‎ను అందుబాటులో పెట్టామని అంటున్నారు సేల్స్ మేనేజర్. ఇప్పుడు ఓవల్ కట్, రోజ్ గోల్డ్, ఈస్ట్-వెస్ట్ సెట్టింగ్, స్ల్పీట్ షాంక్, స్టాక్డ్, క్లిస్టర్ , కలర్ జేమ్స్ వంటి రకాలు మంచి లుక్‎తో వచ్చాయి. ట్రెండ్స్ కలెక్షన్‎తో పాటు డైమండ్‎లో కూడా సాంప్రదాయపు వాంకి డిజైన్స్ స్టోర్‎లో పెడుతున్నారు. అందరికి అందుబాటులో ఉండాలని డైమండ్‎లో కూడా మంచి లైట్ వెయిట్ రింగ్స్, అండ్ నెక్ సెట్స్‎ను సేల్‎కి పెట్టారు. వెరైటీ రింగ్స్‎తో ఈ సారి పెళ్లిళ్ల సీజన్‎కు మంచి రింగ్స్ అందరిని అట్రాక్ట్ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..