చర్మంపై కనిపించే ఈ మార్పులు విస్మరించొద్దు.. ఆ దీర్ఘకాలిక వ్యాధికి‌ సంకేతాలు కావొచ్చు!

గతంలో ఈ వ్యాధి వృద్ధులలో మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ సమస్య యువతలో కూడా కనిపిస్తుంది. డయాబెటిస్ సాధారణంగా రక్తంలో చక్కెర స్థాయిలకు సంబంధించినది అయినప్పటికీ, దాని ప్రభావాలు చర్మంతో సహా శరీరంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తాయి..

చర్మంపై కనిపించే ఈ మార్పులు విస్మరించొద్దు.. ఆ దీర్ఘకాలిక వ్యాధికి‌ సంకేతాలు కావొచ్చు!
Diabetes Symptoms On Skin

Updated on: Jan 28, 2026 | 1:20 PM

ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా డయాబెటిస్ కేసులు పెరిగిపోతున్నాయి. గతంలో ఈ వ్యాధి వృద్ధులలో మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ సమస్య యువతలో కూడా కనిపిస్తుంది. డయాబెటిస్ సాధారణంగా రక్తంలో చక్కెర స్థాయిలకు సంబంధించినది అయినప్పటికీ, దాని ప్రభావాలు చర్మంతో సహా శరీరంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయి చాలా కాలం పాటు ఎక్కువగా ఉంటే అది శరీరంలో రక్త ప్రసరణ, తేమ సమతుల్యతను ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. ఇది చర్మం సహజ రక్షణలను బలహీన పరిచి చర్మ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. కానీ అవాగాహన లేకపోవడం వల్ల చాలా మంది ఇలాంటి లక్షణాలను విస్మరిస్తుంటారు. కానీ చర్మంపై ఇలా కనిపించే లక్షణాలు డయాబెటిస్ ముందస్తు హెచ్చరికలు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

చర్మ మార్పులు మధుమేహానికి సంకేతమా?

డయాబెటిస్ చర్మంలో వివిధ మార్పులకు కారణమవుతుంది. శరీరానికి అవసరమైన తేమను నిర్వహించడంలో సమస్యలు తలెత్తితే అది చర్మం పొడిబారడానికి కారణం అవుతుంది. పొడి చర్మం వల్ల కొంతమందికి తరచుగా దురద, మంటలు ఎదురవుతాయి. ముఖ్యంగా మెడ లేదా తొడల చుట్టూ నల్లటి మచ్చలు ఏర్పడటం కూడా ఒక లక్షణం కావచ్చు. చర్మంపై ఏర్పడే చిన్న కోతలు, గాయాలు సైతం మానడానికి సమయం తీసుకోవడం మధుమేహం ప్రధాన లక్షణంగా పరిగణించవచ్చు. పునరావృతమయ్యే ఫంగల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, పూతలు, మొటిమలు కనిపించడం, చర్మంపై ఎరుపు మచ్చలు.. ఇవన్నీ మధుమేహం వచ్చే ముందు చర్మంపై కనిపించే సంకేతాలు. ఈ మార్పులన్నీ శరీరంలోని చక్కెర స్థాయిలు సమతుల్యంగా లేవని సూచిస్తున్నాయి.

నిరోధించడానికి ఏం చేయాలి?

మీ చర్మంపై ఇలాంటి మార్పులు నిరంతరం కనిపిస్తే, ముందుగా రక్తంలో చక్కెర స్థాయిలను తనిఖీ చేసుకోవల్సి ఉంటుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి, సమతుల్య ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాలి. వైద్యుడు సూచించిన విధంగా మందులు తీసుకోవాలి. మీ చర్మాన్ని శుభ్రంగా, తేమగా ఉంచుకోవాలి. రసాయనాలు కలిగిన ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించాలి. చర్మానికి అనుకూలమైన ఉత్పత్తులను మాత్రమే వాడాలి. ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదా గాయం అయినా విస్మరించ కూడదు. అవసరమైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ఇవి కూడా చదవండి

మరిన్నిఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.