Radish Uses: ముల్లంగిని తీసుకుంటే వెయిట్ లాస్ గ్యారెంటీ.. ఇంకా ఎన్నో లాభాలు!

|

Sep 20, 2024 | 12:58 PM

కూరగాయల్లో ముల్లంగి కూడా ఒకటి. ముల్లంగిలో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ముల్లంగిని కూరలు, సలాడ్స్, పప్పు చారు వంటి వాటిల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అయితే ముల్లంగి నుంచి అదొక రకమైన వాసన వస్తూ ఉంటుందని చాలా మంది తినరు. కానీ ఇందులో ఉండే పోషకాలు మాత్రం అన్నీ ఇన్నీ కావు. ముల్లంగి ఆరోగ్యానికి చాలా మంచిది. ముల్లంగిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే లాభాలు చాలా ఉన్నాయి. ముల్లంగిలో విటమిన్లు, ఫోలిక్..

Radish Uses: ముల్లంగిని తీసుకుంటే వెయిట్ లాస్ గ్యారెంటీ.. ఇంకా ఎన్నో లాభాలు!
Radish
Follow us on

కూరగాయల్లో ముల్లంగి కూడా ఒకటి. ముల్లంగిలో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ముల్లంగిని కూరలు, సలాడ్స్, పప్పు చారు వంటి వాటిల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అయితే ముల్లంగి నుంచి అదొక రకమైన వాసన వస్తూ ఉంటుందని చాలా మంది తినరు. కానీ ఇందులో ఉండే పోషకాలు మాత్రం అన్నీ ఇన్నీ కావు. ముల్లంగి ఆరోగ్యానికి చాలా మంచిది. ముల్లంగిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే లాభాలు చాలా ఉన్నాయి. ముల్లంగిలో విటమిన్లు, ఫోలిక్ యాసిడక, పొటాషియం, ఫైబర్, క్యాల్షియం, ఇతర ఖనిజాలు, లవణాలు వంటివి మెండుగా లభిస్తాయి. గర్బిణీ స్త్రీలు తినడం చాలా మంచిది. క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. సాధారణ ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలు తగ్గించడంలో ముల్లండి ఎంతో చక్కగా సహాయ పడుతుంది. మరి మూలంగిని తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాన్సర్లు రావు:

ముల్లంగి తినడం వల్ల పలు రకాల క్యాన్సర్ రాకుండా ఉంటాయి. రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం దూరమవుతుంది. శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తుంది. అంతే కాకుండా క్యాన్సర్‌లను పెంచే ఫ్రీ రాడికల్స్‌ని నశిస్తాయి. వీటిని తినడం వల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి దూరంగా ఉంటాయి.

గుండె పదిలం:

ముల్లంగి తినడం వల్ల గుండె ఆరోగ్యంగా పని చేస్తుంది. ఇందులో ఉండే ఆంథో సైనిన్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు.. గుండె జబ్బులు రాకుండా చేయడంలో హెల్ప్ చేస్తుంది. గుండెపై ఒత్తిడి పడకుండా చేస్తుంది. వాపు సమస్యలు ఉన్నా తగ్గిస్తుంది. శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. దీంతో మరింత ఆరోగ్యంగా పని చేస్తుంది.

ఇవి కూడా చదవండి

బరువు తగ్గుతారు:

ముల్లంగిని రెగ్యులర్‌గా తీసుకుంటే బరువు అనేది అదుపులో ఉంటుంది. ఇందులో పోషకాలు ఎక్కువగా.. క్యాలరీలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అలాగే శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ సమస్యలను కూడా తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్యను కూడా కంట్రోల్‌ అవుతుంది. జీవక్రియ పెరుగుతుంది. కాబట్టి ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

ముల్లంగి తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శక్తిని పెంచడంలో ఎంతో చక్కగా పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులు, ఇతర వ్యాధులు ఎటాక్ చేయకుండా ఉంటాయి.

డయాబెటీస్ కంట్రోల్:

ముల్లంగి తినడం వల్ల డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతుంది. ముల్లంగిలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు అనేది కంట్రోల్ అవుతాయి. కాబట్టి షుగర్ వ్యాధితో బాధ పడేవారు రెగ్యులర్‌గా ముల్లంగి తీసుకోవడం చాలా మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..