Dates for Health: రెండే రెండు ఖర్జూరాలతో 14 రకాల ఆరోగ్య ప్రయోజనాలు.. అయితే వాటిని ఎలా తినాలంటే..

డ్రైఫ్రూట్స్‌లోని ఖర్జూరాలు మన శరీరానికి కావలసిన పోషకాలను అందించడంలో కీలక పాత్రను పోషిస్తాయి. ఇవి సహజంగానే ప్రతి ఇంటిలో కనిపించే శుష్క ప్రాంతాల పండ్లు. ఫైబర్ గనిగా పేరుగాంచిన ఖర్జూరం పోషకాలకు..

Dates for Health: రెండే రెండు ఖర్జూరాలతో 14 రకాల ఆరోగ్య ప్రయోజనాలు.. అయితే వాటిని ఎలా తినాలంటే..
Health Benefits With Dates
Follow us

|

Updated on: Jan 05, 2023 | 3:55 PM

ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే పెద్ద సహసమే. అయితే కొన్ని రకాల ఆహారపు అలవాట్లను పాటించగలిగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పండ్లు, కూరగాయలు, కొన్ని రకాల గింజలు, డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయనే విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా డ్రైఫ్రూట్స్‌లోని ఖర్జూరాలు మన శరీరానికి కావలసిన పోషకాలను అందించడంలో కీలక పాత్రను పోషిస్తాయి. ఇవి సహజంగానే ప్రతి ఇంటిలో కనిపించే శుష్క ప్రాంతాల పండ్లు. ఫైబర్ గనిగా పేరుగాంచిన ఖర్జూరం పోషకాలకు నిధి వంటిది. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఖర్జూరం చాలా ప్రభావవంతమైనదిగా ప్రసిద్ధి. అందుకే పరగడుపునే కనీసం నానబెట్టిన రెండు ఖర్జురాలను అయినా తప్పనిసరిగా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో చిన్నపాటి ఆకలిగా ఉన్నా ఏవేవో చిరుతిళ్లు తినకుండా ఖర్జూరం తింటే ఆకలిని అదుపులో ఉంచుకోవచ్చని కూడా పోషకాహార నిపుణులు అంటున్నారు.

అయితే ఖర్జూరాలను నేరుగా తినడం కంటే నానబెట్టుకుని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని వారు చెబుతున్నారు. నానబెట్టడం వల్ల ఖర్జూరంలోని టానిన్ లేదా ఫైటిక్ యాసిడ్‌  తొలగిపోతుంది. తద్వారా ఖర్జూరంలోని పోషకాలను గ్రహించడంలో రక్తం పని సులభం అవుతుంది. నానబెట్టడం ద్వారా ఖర్జూరాలను వెంటనే జీర్ణం చేసుకోగలుగుతుంది మన శరీరం. ఇక ఇవే కాక నానబెట్టిన ఖర్జూరాలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

నానబెట్టిన ఖర్జూరం ద్వారా కలిగే ప్రయోజనాలు:

  • జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి, పొట్టను శుభ్రంగా ఉంచడంలో ఖర్జూరం ఉపయోగపడుతుంది.
  • గుండె పనితనాన్ని మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయి.
  • నానబెట్టిన ఖర్జూరాలను తినడం ద్వారా కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.
  • ఎముకల దృఢంగా ఉంటాయి.
  • రక్తపోటును నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
  • మెదడు పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది
  • అలసట నుంచి ఉపశమనం పొందడంలో నానబెట్టిన ఖర్జూరాలు ఎంతగానో సహకరిస్తాయి.
  • రక్తహీనతకు సమస్యకు ఉత్తమమపైన పరిష్కారం.
  • బరువు పెరగడానికి సహాయపడతాయి.
  • నానబెట్టిన ఖర్జూరాలను తినడం ద్వారా పైల్స్ ప్రమాదాన్ని నివారించుకోవచ్చు.
  • వాపు, ఎసిడిటీని తగ్గిస్తాయి.
  • ఆరోగ్యకరమైన గర్భధారణకు ఉపయోగకరంగా ఉంటుంది.
  • చర్మం, జుట్టు సంరక్షణలో ప్రయోజనకరంగా పనిచేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..