శీతాకాలం అంటేనే సీజనల్ వ్యాధులతో వచ్చే బాధలు. చల్లని వాతావరణాన్ని ఆస్వాదించాలకున్న వేళ ఆరోగ్య సమస్యలతో బాధపడవలసి ఉంటుంది. మరి ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే ఒక్కటే దారి. శీతాకాలంలో ఏ రకమైన ఆహారపు అలవాట్లు, జీవన విధానం మన ఆరోగ్యానికి మేలు చేస్తాయో తెలుసుకొని వాటిని పాటించడమే. ఇలా చేడయం ద్వారా సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండడమే కాక మన శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. అలాగే శీతాకాలపు చల్లని వాతావరణాన్ని హాయిగా ఆస్వాదించవచ్చు. ఇక శీతాకాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాలలో కంద కూడా ఒకటి. ఈ రోజుల్లో కంద దుంపలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
ఆఫ్రికా, ఆసియా, కరేబియన్ దేశాలలోనే ఎక్కువగా కనిపించే కంద దుంపలు అనేక రకాల పోషక విలువలను కలిగి ఉండి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. యమను సురన్, జిమికాండ్, ఏనుగు పాదం అని కూడా పిలుచుకునే కంద దుంపలు చూడడానికి రాయిలాగా కఠినంగా ఉంటాయి. కానీ వీటిలో విటమిన్లు, ప్రోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రెడ్స్ పుష్కలంగా ఉంటాయి. భూమి లోపల పెరిగే ఈ దుంపకు రక్తంలో చక్కెరను తగ్గించే లక్షణం ఉన్నందున మధుమేహ రోగులకు చాలా మంచి ఆహారం.కంద దుంపలలో పొటాషియం, మెగ్నీషియం, సెలీనియం, జింక్, ఫాస్పరస్, కాల్షియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. కంద దుంపలు మన ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలోనే కాక శరీర రోగనిరోధక శక్తికి కూడా ఉపకరిస్తాయి. అసలు కంద దుంపలతో కలిగే ప్రయోజనాలేమిటో క్లుప్తంగా తెలుసుకుందాం..
కొలెస్ట్రాల్ నుంచి ఉపశమనం: కంద దుంపలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉన్నందున మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. ఈ దుంపలలో 0.2 నుంచి 0.4 శాతం కొవ్వు, 1.7 నుంచి 5 శాతం ఫైబర్‌లు ఉండడం వల్ల ఇవి బరువు తగ్గడంలో కూడా ఉపకరిస్తాయి.
క్యాన్సర్ నిరోధక లక్షణాలు: యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్న కంద దుంపలు పెద్దప్రేగు క్యాన్సర్ పెరుగుదలను గణనీయంగా తగ్గిస్తుందని పలు అధ్యయనాల ద్వారా తేలింది. ఇందులోని పోషకాల కారణంగా శరీర వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
జీర్ణకోశ సమస్యల నియంత్రణ: క్రమరహిత ప్రేగు కదలికల చికిత్సలో, ముఖ్యంగా మలబద్ధకం సమస్యను పరిష్కరించడంలో కంద దుంపలు ఉపయోగకరంగా ఉంటాయి. అతిసారం, విరేచనాలకు చికిత్సగా కూడా ఇది సహాయపడుతుంది.
మెదడు పనితనంలో మెరుగదల: కంద దుంపలను తినడం వల్ల మెదడు పనితనం మెరుగుపడుతుంది. డయోస్జెనిన్ లక్షణాలను కలిగిన కంద దుంపలు న్యూరాన్ల పెరుగుదలలో తోడ్పడతాయి. తద్వారా మెదడు పనితీరును పెంచుతుంది. వీటిని తినడం వల్ల జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..